Begin typing your search above and press return to search.
మాటలేనా..సీడీలేమైనా ఉన్నాయా షబ్బీర్?
By: Tupaki Desk | 24 Oct 2015 4:08 AM GMTమరెవరికీ లేని సౌలభ్యం రాజకీయ నాయకులకు ఒక విషయంలో ఉంటుంది. గాలి వాటున విన్న మాటల్ని కూడా ఆరోపణల రూపంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవటం తరచూ కనిపిస్తూనే ఉంటుంది. విమర్శలు.. ఆరోపణలు చేస్తూనే తమ మాటల పట్ల మరింత నమ్మకాన్ని కలిగించేందుకు వీలుగా తాము చెబుతున్న మాటలకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని వాటిని త్వరలో బయటపెడతామన్న కొసరు మాట కూడా చెప్పేస్తుంటారు.
తాజాగా ఇలాంటి వ్యాఖ్యల్నే చేసుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ.. పొంగులేటి సుధాకర్ రెడ్డిలు. వీరిద్దరి తాజా ఆరోపణ ఏమిటంటే.. ఏపీ ముఖ్యమంత్రి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరి మధ్యా డీల్ కుదిరిందని. వీరి మధ్య డీల్ కుదరటానికి ఒక పెద్దమనిషి మధ్యవర్తిగా వ్యవహరించారని వీరిద్దరూ చెబుతున్నారు. వీరి మధ్య డీల్ కుదరటానికి కారణమైన మధ్యవర్తి ఎవరో తమకు తెలుసని.. తమ ఆరోపణలకు సాక్ష్యంగా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇంతకీ.. ఈ ఇద్దరు నేతల మధ్య డీల్ ఎందుకు కుదిరిందంటే.. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ కేసుల నుంచి బయటపడేందుకేనని వారు చెబుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడేందుకు చంద్రుళ్లు ఇద్దరూ రాజీ పడ్డారన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉవాచ.
చంద్రుళ్ల ఇద్దరి మధ్య డీల్ కుదిర్చిన మధ్యవర్తి ఎవరన్న విషయాన్ని త్వరలో బయటపెడతామన్నారు. ఇవాల్టి.. రేపటి రోజున టీవీల్లో సీడీలు టెలికాస్ట్ అవుతున్నా.. సవాలక్ష సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది ఆధారాలున్నాయి బయటపెడతామనే వారు.. ముందే ఆధారాల సహా ఎందుకు బయటపెట్టటం లేదో..?