Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ గెలుపు:మ‌రో స‌న్యాసం రెడీ

By:  Tupaki Desk   |   22 Jan 2016 3:26 PM GMT
టీఆర్ ఎస్ గెలుపు:మ‌రో స‌న్యాసం రెడీ
X
గ్రేట‌ర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుపుపై మ‌రో స‌వాల్ ఎదురైంది. గ్రేట‌ర్ పీఠంపై గులాబీ జెండా ఎగ‌ర‌క‌పోతే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఇప్ప‌టికే కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఆయ‌న స‌వాల్‌ కు టీడీపీ తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ వంద స్థానాల్లో టీఆర్ ఎస్ గెలిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌తి స‌వాల్ విసిరారు. ఇపుడు కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి మ‌రో రాజ‌కీయ స‌వాల్ వ‌చ్చింది.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్‌ ఎస్‌ పార్టీకి వంద సీట్లు వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ సవాల్‌ చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ష‌బ్బీర్ అలీ తాను రాజీనామ‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని...100 సీట్లు రాకుంటే కేటీఆర్‌ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. నామినేషన్లు ఉపసంహరించాలని టీఆర్‌ ఎస్‌ రెబల్స్‌ ను అధికార పార్టీ నేతలు బెదిరించారని ఆరోపించారు. టీఆర్‌ ఎస్ మేనిఫెస్టోలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, సీమాంధ్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ప్రస్థావనే లేదన్నారు. 60 సీట్లలో పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్థి మేయర్‌ ఎలా అవుతారని ష‌బ్బీర్ అలీ ప్రశ్నించారు. ఎంఐఎం, టీఆర్‌ ఎస్‌ పార్టీల మధ్య ఒప్పందాన్ని ఆ పార్టీలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. జాతీయ భావాలుగ‌ల కాంగ్రెస్‌ ను గెలిపించ‌డం ద్వారానే హైద‌రాబాదీల‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పారు.