Begin typing your search above and press return to search.

అమిత్ షా కోరిక‌ను నెర‌వేర్చిన అస‌ద్‌

By:  Tupaki Desk   |   14 Jan 2017 6:36 AM GMT
అమిత్ షా కోరిక‌ను నెర‌వేర్చిన అస‌ద్‌
X

పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కేంద్ర హజ్ కమిటీ ఇచ్చే సబ్సిడీని రద్దు చేసి, ఆ మొత్తాన్ని ముస్లింల సంక్షేమానికి మళ్లించాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహ్మద్ షబ్బీర్ అలీ మండిపడ్డారు. జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్లాలని ముస్లింలకు ఉంటుందని, బ్రిటీష్ కాలంలోనే 1932 లో సబ్సిడీ ప్రారంభమైందని చెప్పారు. ప్రతి ఏడాది 1.72 కోట్ల మందికి కేంద్రం రూ. 690 కోట్లు ఇస్తున్నట్టు ష‌బ్బీర్ అలీ తెలిపారు. ముస్లింలకు సబ్సిడీ రద్దు చేసి నిధులు సంక్షేమానికి మళ్లించాలని అసద్ కోరటం సరికాదన్నారు. ఆర్ ఎస్ ఎస్ ఎజెండాను అసద్ మోస్తున్నారని ఆరోపించారు. 2004లో రూ. 74 లక్షలున్న మీ ఆదాయం, 2014 నాటికి రూ.4 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. 'మీరు నేను కోటీశ్వరులం' ఎన్నిసార్లైనా వెళ్లొచ్చు.. పేద ముస్లింలు మక్కా వెళ్లకూడదా అని షబ్బీర్ ప్రశ్నించారు. అసద్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని ష‌బ్బీర్ అలీ కోరారు.

ముస్లింల మక్కా యాత్రకు సబ్సిడీ అనవసరమని చెప్ప‌డమ‌నే ఆర్ఎస్ఎస్ ఎజెండాను మీరు మోస్తున్నారా? అని అస‌దుద్దీన్‌ను ష‌బ్బీర్ అలీ ప్ర‌శ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీతో మాట్లాడిస్తున్నారా? ఆయ‌న మాట‌ల‌ను మీ నోటితో వెల్ల‌డించారా అంటూ ప్ర‌శ్నించారు. ఇలాంటి సూచనలు సరి కాద‌ని ష‌బ్బీర్ అలీ తీవ్రంగా స్పందించారు. జీవితంలో ఒక్కసారైనా హజ్కు వెళ్లాలని ప్రతీ ముస్లిం కోరుకుంటారని, అలాంటి వారికి సబ్సిడీ ఇవ్వవద్దని చెప్పడం సరికాదఅన్నారు. మీరు, నేను కోటీశ్వరులం, ఎన్నిసార్లైనా హజ్కు వెళ్లి వచ్చే అవకాశం ఉంది. కాని పేద ముస్లింలు మక్కా వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. కాగా...ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 12 శాతానికి పెంచేలా అసెంబ్లీలో బిల్లు పెట్టేముందు ముఖ్యమంత్రి కేసిఆర్ సర్కార్ న్యాయ నిపుణులతో సమగ్రంగా చర్చించాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కోర్టులో నిలబడేలా పకడ్బందీగా బిల్లును రూపొందించాలని, అలా కాకుండా రాష్ట్రప్రభుత్వం ఇష్టానుసారంగా బిల్లును తెస్తే.. అది కోర్టులో నిలబడకపోతే అందుకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/