Begin typing your search above and press return to search.
హెరిటేజ్ ఆ మీడియా సంస్థకు యాడ్ ఇచ్చిందా?
By: Tupaki Desk | 7 July 2015 10:02 AM GMTఅవకాశం లభించాలే కానీ ఏ చిన్న విషయాన్ని రాజకీయ నాయకులు వదిలేందుకు ఇష్టపడరు. అందులోకి ప్రజల దృష్టిని ఆకర్షించే అంశాలంటే ఏ రాజకీయ నేత మాత్రం ఊరుకుంటారా? తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు.. విపక్ష తెలుగుదేశానికి ఉమ్మడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రెండు పార్టీల్ని ఏకకాలంలో బుక్ చేసే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు.
తాజాగా అలాంటి అవకాశం లభించటంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ చెలరేగిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. దీనికి తన దగ్గర ఆధారాలు ఉన్నట్లు చెప్పిన ఆయన.. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ.. కేసీఆర్‌కు చెందిన నమస్తే తెలంగాణ పత్రికకు యాడ్ ఇవ్వటాన్ని ప్రస్తావిస్తున్నారు.
హెరిటేజ్ సంస్థ నమస్తే తెలంగాణలో తప్పించి మరే మీడియా సంస్థకు యాడ్ ఇవ్వలేదని.. ఈ యాడ్ ఇచ్చిన తీరు చూస్తే.. ఇద్దరు చంద్రుళ్ల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ జరిగినట్లేనని ఆరోపిస్తున్నారు. వ్యాపారం అన్న తర్వాత.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా అవసరానికి తగినట్లుగా వ్యవహరిస్తారు. యాడ్ ఇస్తేనే.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయినట్లా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రశ్నల సంగతి తర్వాత.. తన వాదనతో అందరి దృష్టిని ఆకర్షించటంలో మాత్రం షబ్బీర్ సక్సెస్ అయ్యారనే చెబుతున్నారు.