Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మ‌హిళా అంటే క‌విత ఒక్క‌రే

By:  Tupaki Desk   |   9 March 2017 6:02 AM GMT
తెలంగాణ‌లో మ‌హిళా అంటే క‌విత ఒక్క‌రే
X
తెలంగాణ శాస‌నమండ‌లి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఘ‌నంగా వేడుక‌లు జ‌రుపుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. జనాభాలో మహిళలు సగం ఉన్నా ఒక్కరికీ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని అవమానించారని ఆయ‌న మండిప‌డ్డారు. రాష్ట్రంలో మహిళ అంటే మీ కూతురు కవిత ఒక్కరేనా? అని కేసీఆర్‌ ను ప్రశ్నించారు. మహిళలకు మంత్రి పదవులు ఇస్తే తన కూతురుకు ప్రాధాన్యం తగ్గుతుందని కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు.

ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు మ‌హిళ‌ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంలో జాప్యం ఎందుకని ష‌బ్బీర్ అలీ ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం అవ‌డం, అంత‌ర్జాతీయ మ‌హిళ దినోత్స‌వం సంద‌ర్భంగా చివాట్లు త‌ప్ప‌వ‌నే ఉద్దేశంతోనే నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద పీట అనే లీకులు ఇచ్చార‌ని తెలిపారు. చిత్రంగా ఈ అవ‌కాశం క‌ల్పించేందుకు ఏర్పాటు చేసిన క‌మిటీకి సైతం కేసీఆర్ కూతురు క‌విత సార‌థ్యం వ‌హిస్తున్నార‌ని ష‌బ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ క‌ప‌ట ప్రేమ‌ను మ‌హిళ‌లు గుర్తిస్తున్నార‌ని, స‌రైన స‌మ‌యంలో స్పందిస్తార‌ని ఆయ‌న అన్నారు. ఇదిలాఉండ‌గా...అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌ మహిళా అటెండర్లను కాంగ్రెస్‌ నేతలు సన్మానించారు.35 సంవత్సరాలుగా గాంధీభవన్‌లో సేవలు అందిస్తున్న యాదమ్మతోపాటు సంధ్య, ఆలీమాలను ఘనంగా సన్మానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/