Begin typing your search above and press return to search.
ఇప్పుడు ఫీల్ అయితే ఏం లాభం షబ్బీర్?
By: Tupaki Desk | 4 Feb 2016 5:43 AM GMTచెడును ప్రోత్సహించటం పాముకు పాలు పోసి పెంచటం లాంటిదేనన్న సత్యం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఇప్పటికి అర్థమైంది. ఆయనకు విషయం అవగాహన అయ్యేసరికి జరగరానివి చాలానే జరిగిపోవటమే కాదు.. ఆయన ఎప్పుడూ మర్చిపోలేని తీవ్ర అవమానాన్ని మూటగట్టుకున్నారు. తన లాంటి నేతను పట్టపగలు అందరూ చూస్తుండగానే.. కారులో నుంచి బయటకు లాగి మరీ దాడి చేసుకోవటాన్ని షబ్బీర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత జరిగినా.. తనపై దాడి చేసిన వారిపై కనీసం చర్యలు కూడా తీసుకోవటం లేదని తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మజ్లిస్ అధినేత మొదలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. కార్యకర్తలు ఏ రేంజ్ లో చెలరేగిపోయింది తెలిసిందే.
ఈ ఘటనలపై తాజాగా మాట్లాడిన షబ్బీర్ అలీ.. మజ్లిస్ వైఖరిని బయటకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. షబ్బీర్ నోటి వెంట వచ్చే చాలామాటలకు సంబంధించిన సమాచారం అందరికి తెలిసిందే కావటం గమనార్హం. అధికారంలో ఎవరుంటే.. వారికి మిత్రులుగా మారే అలవాటున్న మజ్లిస్ ను తాము అనవసరంగా పెంచి పోషించామని షబ్బీర్ ఫీల్ అవుతున్నారు. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో ఎనిమిదేళ్లు మజ్లిస్ అనే పాముకు పాలు పోసి మరీ పెంచామని ఆయన ఆవేదన చెందుతున్నారు. తాము చాలా పెద్ద తప్పుచేశామని వాపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అన్ని పార్టీ నేతల్ని మజ్లిస్ నేతలు చితకబాదారంటూ చెబుతున్నారు. పామును పెంచినప్పుడు లేని బాధ.. ఆ పాము కాటేసినప్పుడు ఫీల్ అయితే ఎలా షబ్బీర్ సాబ్?