Begin typing your search above and press return to search.
దానం కోసం గులాబీ బ్యాచ్ మైండ్ గేమ్?
By: Tupaki Desk | 7 Dec 2015 9:34 AM GMTతెలంగాణ అధికారపక్షానికి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మధ్య దానం వ్యవహారం దోబూచులాడుతోంది. పార్టీ వర్గాలు ఒకరంగా.. పత్రికలు మరో రకంగా.. తెలంగాణ అధికారపక్ష నేతలు ఇంకో రకంగా మాట్లాడుకోవటం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపరేషన్ ఆకర్ష్ ను స్టార్ట్ చేసిన చాలామంది వివిధ పార్టీల నుంచి తెలంగాణ అధికారపక్షంలో భాగస్వాములు అయ్యారు. కానీ.. మరే నేత విషయంలోనూ జరగనంత డ్రామా దానం విషయంలో జరగటం గమనార్హం. దానం నాగేందర్ సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లుగా పలు మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అందుకు భిన్నంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన దానం నాగేందర్.. తాను కాంగ్రెస్ ను వీడటం లేదని.. తన పరపతిని దెబ్బ తీయటానికి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేయటానికి కొందరు కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
తాను పార్టీ మారేది లేదని తేల్చేశారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. దానం విషయంలో టీఆర్ ఎస్ మైండ్ గేమ్ ఆడుతోందన్నారు. తమ పార్టీ నుంచి దానంను దెబ్బ తీయటానికి ఇలాంటి ప్రచారానికి టీఆర్ ఎస్ నేతలు పాల్పడుతున్నారని షబ్బీర్ ఆరోపించారు. దానం కోసం గులాబీ నేతలు ఇంత రచ్చ చేసుకుంటారా..?