Begin typing your search above and press return to search.
కేటీఆర్ ఓ బచ్చా అంటున్న సీనియర్
By: Tupaki Desk | 14 Feb 2017 2:36 PM GMTకాంగ్రెస్ సీనియర్ నేత - శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల వీపులు పగలగొడుతారని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కేటీఆర్ ఓ బచ్చా అని అలాంటి వ్యక్తి వంద సంవత్సరాలకు పైబడిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. తమ వీపులు పగలగొట్టడం కాదు... వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ చెప్పులతో కొట్టడం ఖాయమని షబ్బీర్ అలీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో కేటీఆర్ తన తండ్రి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడగాలని కోరారు. ఆయన తండ్రికి రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని షబ్బీర్ అలీ తెలిపారు.
మంత్రి కేటీఆర్ తన శాఖ అయిన చేనేత శాఖలో భాగంగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను నియమించడం వెనుక మతలబు ఏమిటని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. చేనేత బట్టలకు ప్రచారానికి తెలంగాణ బిడ్డలు పనికిరారా అని నిలదీశారు. సినీ నటుడు నాగార్జునతో లావాదేవీలతోనే సమంతకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని ఆరోపించారు. రాష్ట్రంలో వైద్యం పడకేసినా సీఎం కేసీఆర్ కు పట్టడం లేదని ఆరోపించారు. తక్షణం రాష్ట్రంలో హెల్త్ ఏమర్జెన్సీ ప్రకటించాలని, గవర్నర్ వైద్య పరిస్థితిపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ హాస్పిటల్స్ విజిట్ చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
కాగా మంత్రి జూపల్లి కృష్ణారావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. జూపల్లి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, జూపల్లి చరిత్ర తెలిస్తే తెలంగాణ ప్రజలు ఆయన్ను అసహ్యించుకుంటారని పేర్కొన్నారు. టూటీలు, నేరాలు, ఫోర్ ట్వంటీ .. చరిత్ర జుపల్లిదని ఆరోపించారు. దేవుని మాన్యాన్ని కాజేసిన దాగుల్బాజీ జూపల్లి అని విమర్శించారు. బ్యాంకు లూటీ అంశంలో స్వంత గ్రామంలో ప్రజలు తరిమికొడితే పారిపోయి హైద్రాబాద్ కు వచ్చిన చరిత్ర జూపల్లిదని విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని హుసేన్ సాగర్ లో తోసి చంపిన ఆరోపణలు జూపల్లి ఫై ఉన్నాయని వంశీ సంచలన కామెంట్లు చేశారు. ప్రుడెన్షియల్ బ్యాంకు ముంచిన చరిత్ర జూపల్లి కృష్ణారావు అన్నారు జూపల్లి ఓ వెధవ - లఫుట్ గాడు - నీతిమాలిన వ్యక్తి అని విరుచుకుపడ్డారు. జూపల్లికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని, ఎవరు లఫుట్ గాడో తెలుస్తుందని వంశీచంద్ రెడ్డి అన్నారు. జూపల్లి మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. గతంలో కేఎల్ ఐ కాల్వలను వెడల్పు తగ్గించి కాంట్రాక్టర్ల వద్ద లంచాలు దండుకున్న వ్యక్తి జూపల్లి కృష్ణారావు అని వంశీచంద్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మళ్ళీ పాలమూరు కాల్వలను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. నీతితో కూడిన రాజకీయాలు తనవైతే నీతిమాలిన రాజకీయాలు జుపల్లివని వంశీచంద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/