Begin typing your search above and press return to search.
కేటీఆర్ కు భారీ పంచ్ వేసిన షబ్బీర్!
By: Tupaki Desk | 7 Nov 2017 5:33 AM GMTఅధికారంతో లాభాలే కాదు.. కొన్ని ఇబ్బందులూ ఉంటాయి. ఉద్యమ నేతలుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న టీఆర్ఎస్ కు గతంలో ఎదురే ఉండేది కాదు. వారి నోటి నుంచి మాటలు వచ్చే ఏ పార్టీ అయినా మౌనం దాల్చాల్సి వచ్చేది. ఎప్పుడూ అధికారంలోని టీఆర్ఎస్.. ఎప్పుడో ఒకప్పుడు ఎంతోకొంతకాలం పవర్ లో ఉన్న పార్టీలను ఒక ఆట ఆడుకునేవారు.
అయితే.. ఇలాంటివి అన్నిరోజులు సాధ్యం కావు. ఎప్పుడైతే చేతికి పవర్ వచ్చిందో.. నాటి నుంచే విమర్శల కౌంట్ డౌన్‌కు తెర లేస్తుంది. అధికారపక్షంపై విరుచుకుపడేందుకు బోలెడన్ని అవకాశాలు ఉంటాయి. వాటిని సమర్థంగా వినియోగించే నేతలు ఎవరైనా చట్టసభల్లో ఉంటే అధికారపక్షానికి చుక్కలు కనిపించటం ఖాయం.
తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు. రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి మాట రావటం ఆలస్యం.. ఓ రేంజ్లో ఏసుకునే కేటీఆర్ కు తాజా ఎపిసోడ్ లో మాత్రం చిరాకు పుట్టటమేకాదు.. ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. కేటీఆర్ ను అంతగా ఇబ్బంది పెట్టిన నేత ఎవరో కాదు.. సీనియర్ కాంగ్రెస్ నేత.. మాజీ మంత్రిగా పని చేసిన షబ్బీర్ అలీ.
కులాసాగా నవ్వుతూ.. షార్ప్ పంచ్ లు వేసే ఆయన.. శాసనమండలి లో మంత్రి కేటీఆర్ కు షాకిచ్చారు. హైదరాబాద్ లో రోడ్ల నిర్వాహణ విషయంపై టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. గతంలో ఇంటి నుంచి అరగంటలో అసెంబ్లీకి వచ్చే వాళ్లమని.. ఇప్పుడు మాత్రం గంటకు పైగా టైం పడుతోందన్న ఆయన.. హైదరాబాద్ లో రోడ్లు భారీగా దెబ్బ తిన్నాయని.. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.
ప్రజల కోసం కాకున్నా.. త్వరలో హైదరాబాద్ కు వచ్చే ట్రంప్ కుమార్తె ఇవాంకా.. ప్రధాని మోడీ కోసమైనా రోడ్లు బాగు చేయించాలంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయటంతో కేటీఆర్ కు కాలిపోయింది. ఇలాంటి సమయాల్లో తనకు బాగా అలవాటైన చరిత్రను తవ్వే కార్యక్రమానికి తెర తీశారు కేటీఆర్. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నగరంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా సరిగా నిర్వహించలేని కాంగ్రెస్ నేతలు చెబితే నేర్చుకునే పరిస్థితుల్లో తాము లేమన్న ఆయన.. రోడ్లను భారీ వ్యయంతో బాగు చేస్తున్నామని.. మూసీ.. రోడ్ల అభివృద్దికి రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా చెప్పాలి.
అయినా.. కేటీఆర్.. షబ్బీర్ భాయ్ అడిగింది.. రోడ్ల గురించి అయితే.. మీరు డ్రైనేజీ ముచ్చటలోకి వెళతారే. ఆ మాటకు వస్తే.. మూడున్నరేళ్ల తమరి హయాంలో డ్రైనేజీ వ్యవహారం మరింత దారుణంగా తయారైంది. ఇది ప్రజలందరికి బాగా తెలుసు. చేసిన విమర్శకు సూటి సమాధానం చెప్పకుండా.. ఎదురుదాడి చేయటం ద్వారా సభలో అధిక్యతను ప్రదర్శించుకోవచ్చు కానీ.. ఇలాంటి మాటల్ని ప్రజలు మరోలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆ విషయాన్ని గుర్తిస్తే మంచిది. లేకుంటే.. నోటి మాటతో లేనిపోని వ్యతిరేకత ప్రజల మనసుల్లో రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది సుమా. ఏమైనా తన మాటలతో కేటీఆర్ కు కాలిపోయేలా చేయటంలో షబ్బీర్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.