Begin typing your search above and press return to search.

షా ఎంట్రీ.. ఏపీ బీజేపీలో కొత్త జోష్‌..!

By:  Tupaki Desk   |   5 Jan 2023 4:41 AM GMT
షా ఎంట్రీ.. ఏపీ బీజేపీలో కొత్త జోష్‌..!
X
ఏపీ బీజేపీలో కొత్త జోష్ క‌నిపిస్తోంది. వైసీపీ నుంచి నాయ‌కుల‌ను తీసుకుంటున్నామ‌ని.. వైసీపీ నుంచి చాలా మంది సిట్టింగులు త‌మ పార్టీలోకి రానున్నార‌ని నాయ‌కులు ప్ర‌క‌ట‌నలు చేస్తున్నారు. ఈ ప‌రిణామాల‌కు రీజ‌న్‌.. ఈ నెలలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు అమిత్ షా రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నుండ‌డ‌మే. షా పర్య‌ట‌న ఇప్ప‌టికేఖ‌రారైంది. క‌ర్నూలులో ఆయ‌న ప‌ర్య‌టిం చ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌తో కీల‌క భేటీలు.. వ‌రుస‌గా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా అమిత్ షా.. ఏపీ నేత‌ల‌కు ఎలాంటి సందేశం ఇవ్వ‌నున్నారు? వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎలాంటి రోడ్ మ్యాప్ ఇవ్వ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువ‌స్తామ‌ని.. లోక‌ల్ నేత‌లు చెబుతున్నా.. కేంద్రంలోని బీజేపీ వ్యూహం వేరేగా ఉంది. త‌మ‌కు అనుకూలంగా ఉన్న జ‌గ‌న్ స‌ర్కారును మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా స‌హ‌క‌రించ‌డ‌మే ఇప్పుడు బీజేపీ ముందున్న వ్యూహంగా డిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే.. టీడీపీతో పొత్తు విష‌యంలో ఇప్ప‌టికీ నాన్చుడు ధోర‌ణిని అవ‌లంభిస్తున్నార‌ని అంటున్నాయి.

మ‌రోవైపు.. బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన మాత్రం టీడీపీతో క‌లిసి ముందుకు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలో షా ఇప్పుడు ఏం చెబుతారు? నిజానికి టీడీపీతో క‌లిసి ముందుకు వెళ్లిన ప్ర‌తిసారీ.. బీజేపీ పుంజుకుంది. అధికారం కూడా పంచుకుంది. అయితే.. ఇప్పుడు వ్యూహం మారింది. టీడీపీ ప‌ల‌చ‌న అయితే.. దాని తాలూకు గ్యాప్‌ను తాము తీసుకుని.. భ‌ర్తీ చేయాల‌నేది బీజేపీ వ్యూహం. అయితే..ఇ ప్పుడు టీడీపీ పుంజుకుంది. చంద్ర‌బాబు మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌నే ఎందుకు అనుకూలంగా మార్చుకోకూడ‌ద‌నేది బీజేపీలో ఉన్న కొంద‌రి వాద‌న‌.

ఈ నేప‌థ్యంలో అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో టీడీపీతో పొత్తు వ్య‌వ‌హారంపై తేల్చేస్తార‌ని తెలుస్తోంది. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌తో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? వైసీపీపై ఎలాంటి దాడి చేయాలి? వంటి కీల‌క అంశాల‌పైనా ఆయ‌న దిశానిర్దేశం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా సోము వీర్రాజు నాయ‌క‌త్వంపై రాష్ట్ర బీజేపీ నేత‌లు పెద్ద‌గా సంతృప్తి వ్య‌క్తం చేయ‌డం లేదు.

పురందేశ్వ‌రి, స‌త్య‌కుమార్‌, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ, విష్ణుకుమార్‌రాజు స‌హా ఇత‌ర నాయ‌కులు సైతం వీర్రాజుపై వ‌ర్రీగానే ఉన్నారు. ఈ క్ర‌మంలో షా.. ఈ విష‌యం కూడా తేల్చేస్తార‌ని తెలుస్తోంది. మొత్తంగా ఎలా చూసుకున్నా..షా ప‌ర్య‌ట‌న ఏపీ బీజేపీలో జోష్ నింపుతుంద‌నే ప్ర‌చారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.