Begin typing your search above and press return to search.

ఘనంగా షాహిద్ అఫ్రిది కుమార్తె వివాహం..!

By:  Tupaki Desk   |   31 Dec 2022 10:31 AM GMT
ఘనంగా షాహిద్ అఫ్రిది కుమార్తె వివాహం..!
X
పాకిస్థాన్ మాజీ కెప్టెన్.. ప్రస్తుత పాక్ చీఫ్ సెలక్టర్ షాహిద్ అఫ్రిది ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె అక్సాకు నసీర్ నాసిర్ అనే వ్యక్తితో శుక్రవారం వివాహం జరిగింది. అతంత్య సన్నితుల సమక్షంలో అఫ్రిది కూతురి నిఖా జరగడం గమనార్హం.

ఇక ఈ పెళ్లి వేడుకలో పాకిస్తాన్ స్టార్ పేపర్ షాహిన్ షా ఆఫ్రిది సందడి చేశారు. ఈ వేడుకల్లో షాహినే సెంటరాఫ్ అట్రాక్షన్ నిలిచాడు. తనకు కాబోయే మామ ఆఫ్రిదితో కలిసి తన తోడల్లుడు వెనకాల నిల్చొని పెళ్లి వేడుకను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

కాగా గతంలోనే షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తె అన్షా అఫ్రిదితో షాహీన్ పెళ్లి జరుగుతుందనే విషయాన్ని అఫ్రిది కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పెద్ద కూతురి వివాహం జరిగిన తర్వాత తన రెండో కుమార్తె అన్షా వివాహం జరిపించాలని వారంతా నిర్ణయించారు.

ఈ మేరకు షాహిద్-అన్షాల వివాహానికి ముహూర్తం ఫిబ్రవరి 3న ఖరారైంది. కాగా తన కుమార్తె తో షాహిన్ నిఖా గురించి అతడి కుటుంబ సభ్యులు గతంలోనే తమను సంప్రదించారని అఫ్రిది వెల్లడించారు. కాగా అఫ్రిదికి మొత్తం ఐదుగురు ఆడపిల్లలు సంతానం. ఐదోవ కూతురు రెండేళ్ల క్రితం జన్మించడం విశేషం.

ప్రస్తుతం వీరిలో పెద్ద కూతురు ఆక్సాకు వివాహం జరిగింది. ఫిబ్రవరి 3న రెండో కూతురు అన్హా అఫ్రిది వివాహం జరుగనుంది. మిగతా పిల్లలు ప్రస్తుతం చదువుకుంటున్నారు. మరోవైపు అఫ్రిది ఇటీవలే పీసీబీ చీఫ్ సెలక్టర్ గా ఎన్నికగా.. షాహిన్ పాకిస్థాన్ పేస్ బౌలర్ గా రాణిస్తున్నారు. ఇలా మామ-అల్లుళ్లు పాకిస్థాన్ క్రికెట్లో కీలక సభ్యులుగా మారిపోయారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.