Begin typing your search above and press return to search.
భారత్ పై అఫ్రిది షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 3 April 2018 11:42 AM GMTభారత్ పై పాకిస్థాన్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ షాహిద్ అఫ్రిది సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ కు వ్యతిరేకంగా షాకింగ్ కామెంట్స్ చేస్తూ ట్వీట్ చేశాడు. భారత ఆక్రమిత కాశ్మీర్‌లో పరిస్థితులు భయానకంగా, ఆందోళనకరంగా ఉన్నాయని ట్వీట్ చేశాడు. అక్కడ దౌర్జన్యకరమైన పాలనలోని తూటాలకు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నాడు. స్వాతంత్ర్యం కోసం గళమెత్తుతున్నవారిని అణచివేస్తున్నారని అన్నాడు. ఈ విషయంలో ఐక్య రాజ్య సమితితో పాటు ప్రపంచంలోని మిగతా సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాడు. ఈ రక్తపాతాన్ని వారు ఎందుకు ఆపలేకపోతున్నారని అఫ్రిది ట్వీట్ చేశాడు.
అయితే, భారత్ పై అఫ్రిది విషం కక్కడం ఇది తొలిసారేమీ కాదు. భారత్ పై ఈ దాయాదిదేశ ఆటగాడు గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ క్రికెటర్లకు చాలామంది కశ్మీరీలు మద్దతిచ్చారని 2016లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ మండిపడింది. మరో మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి, 2015లో మెహబూబా నేతృత్వంలోని పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాక కల్లోల లోయలో శాంతి నెలకొంది. 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం కశ్మీర్ లో భద్రతా బలగాలపై అల్లరి మూకల రాళ్ల దాడులు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే - కశ్మీర్ లో ఉగ్రమూకలు....నిత్యం భారత సైనికులపై కాల్పులకు తెగబడుతున్న ఘటనలు, విధినిర్వహణలో అమరులవుతున్న వీర జవాన్లు అఫ్రిది కళ్లకు కనబడడం లేదా అంటూ....నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నిత్యం భారత సైనికులపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు గోతికాడ నక్కలాగా కాచుకొని ఉంటారని, వారిని భారత సైన్యం సమర్థ మంతంగా తిప్పికొడుతున్న విషయం అఫ్రిది గమనించాలని వారు కోరుతున్నారు. దేశ సమైక్యతకు భంగం కలిగించి, ప్రశాంతజీవనం కొనసాగిస్తోన్న కశ్మీరీలలో ఇటువంటి వ్యాఖ్యలతో విష బీజాలు నాటడం అఫ్రిది మానుకోవాలని హితవు పలుకుతున్నారు.