Begin typing your search above and press return to search.
ఆఫ్రీది గుగ్లీకి మన క్రికెటర్ల సిక్సర్లు.. ఫోర్లు!
By: Tupaki Desk | 5 April 2018 4:39 AM GMTఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా భారత.. పాక్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అవసరం లేకున్నా కశ్మీర్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చిన ఆఫ్రిదీ వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆఫ్రీదీ విసిరిన గుగ్లీకి తమ వ్యాఖ్యలతో సిక్సర్లు.. ఫోర్లతో అదరగొట్టారు భారత క్రికెటర్లు.
జమ్మూ కశ్మీర్ లో భారత్ దాష్టీకాలకు ఎందరో అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయంటూ ఆఫ్రీదీ ఆరోపించారు. కానీ.. అదంతా తమ సైన్యం.. తమ దేశం నుంచి పంపిన ఉగ్రవాదుల కారణమన్న విషయాన్ని మాత్రం మర్చిపోయినంత పని చేశారు. కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలంటూ తనకు సంబంధం లేని అంశంపై అనవసర వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీల ధృఢ సంకల్పాన్ని.. వారి స్వాతంత్య్ర కాంక్షను భారత్ తొక్కి పెడుతోందన్నారు.
దీనిపై భారత క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. ఆఫ్రీదీ చేసిన వ్యాఖ్యలపై ట్వీట్లతో బదులిచ్చారు. ఆఫ్రీదీ వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయిన కోహ్లీ.. భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న దేనికీ తాను మద్దతు పలకనని చెప్పారు. భారత క్రికెటర్ గా తాను ఎప్పుడూ దేశ ప్రయోజనాల గురించి మాట్లాడతానని.. ఒకవేళ ఆ విషయంలో ఎవరైనా విభేదిస్తే.. దాన్ని తానెప్పటికి అంగీకరించనని చెప్పారు.
హర్యానా హరికేన్ గా సుప్రసిద్దుడు కపిల్ దేవ్ రియాక్ట్ అవుతూ.. అసలు అతను ఎవరు? ఇంత ప్రాధాన్యం అతనికి ఎందుకు ఇస్తున్నాం? ఇలాంటి వారి మాటల్ని పట్టించుకోవాల్సిన పనే లేదన్నారు. ఇక.. రవీంద్ర జడేజా అయితే మరో అడుగు ముందుకేసి.. కశ్మీర్ ను భారత ఆక్రమిత కశ్మీర్ అంటావా? నీకెంత ధైర్యం? కశ్మీర్ ఎప్పుడూ భారత్ దే. ఆ మాటకు వస్తే.. మీ దేశం మొత్తం పాక్ ఆక్రమిత భారత్ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. క్రికెట్ దేవుడిగా అభివర్ణించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సైతం ఆఫ్రీదీ వ్యాఖ్యల్ని తిప్పు కొడుతూ.. మా దగ్గర దేశాన్ని ముందుకు నడిపించగల సమర్థులైన వారికి కొదవ లేదు.. మేం ఏం చేయాలనేది బయటి వారు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని తేల్చారు. భారత్ లో కశ్మీర్ అంతర్బాగం.. అది శాశ్వితమని రైనా బదులిచ్చారు. అంతేకాదు.. కశ్మీర్ పరమ పవిత్రమైన ప్రాంతం.. మా పూర్వీకులు పుట్టింది అక్కడే ఆఫ్రీదీ భాయ్.. మా కశ్మీర్ లో కొనసాగిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపివేయాలని మీ సైనికులకు చెప్పు అని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై కైఫ్ రియాక్ట్ అవుతూ.. డియర్ ఆఫ్రీదీ.. కశ్మీర్ లోకి ఉగ్రవాదుల చొరబాబు వెనుక ఉన్నది మీ దేశమే.. మేం ఎప్పుడూ శాంతిని.. ప్రేమను కోరుకుంటాం.. ఆ శాంతి రెండు వైపుల నుంచి ఉండాలిగా అని వ్యాఖ్యానించారు. ఇక గంభీర్ అయితే ఈ అంశాన్ని క్రికెట్ భాషలో చెబుతూ.. ఆఫ్రీదీ తీరు ఎలా ఉందంటే.. నో బాల్ కు వికెట్ పడితే సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నాడు. చూస్తుంటే.. కశ్మీర్ విషయంలో రాజకీయ నాయకుల కంటే ధీటుగా మన క్రికెటర్లే రియాక్ట్ అయ్యారని చెప్పాలి.