Begin typing your search above and press return to search.

షమీ-షోయబ్ ట్వీట్ వార్ పై స్పందించిన షాహిద్ అఫ్రిది

By:  Tupaki Desk   |   14 Nov 2022 1:30 PM GMT
షమీ-షోయబ్ ట్వీట్ వార్ పై స్పందించిన షాహిద్ అఫ్రిది
X
టీ20 ప్రపంచ కప్ ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ చిచ్చుపెట్టింది. క్రికెట్ అభిమానులే కాదు.. క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు కూడా విడిపోయి కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో కొట్టుకుంటున్నారు.  మొదట టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోగానే భారత అభిమానులు ట్రోల్ చేశారు. ఆ తర్వాత సెమీస్ లో టీమిండియా ఓడిపోగానే పాక్ మాజీ క్రికెటర్ షోయాబ్ అక్తర్ అయితే రెచ్చిపోయాడు. టీమిండియా ఓటమిని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా ఫైనల్ లో పాకిస్తాన్ కూడా ఓడిపోవడంతో భారత అభిమానులు, టీమిండియా క్రికెటర్ కౌంటర్లు ఇస్తున్నాడు.

ప్రస్తుతం టీమిండియా ఆటగాడు షమీ, పాక్ మాజీ పేసర్ షోయాబ్ అక్తర్ ట్విటర్ వేదికగా ట్వీట్లు వైరల్ గా మారాయి.  అక్తర్ కు మన షమీ ట్విటర్ లోనే కౌంటర్ ఇచ్చాడు. ‘సారీ బ్రదర్.. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని కర్మ అంటారు’ అని ట్వీట్ చేశాడు. దీనికి షోయబ్ అక్తర్ హృదయం ముక్కలైన ఎమోజీని జత చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది. దీనిపై పాక్ అభిమానులు, మాజీలు తమ అసహనం వ్యక్తం చేశారు.

షమీ ట్వీట్ కు ప్రతిస్పందనగా షోయబ్ అక్తర్ కూడా ప్రముఖ వ్యాఖ్యాత హర్షాభోగ్లే వ్యాఖ్యలను జత చేస్తూ ట్వీట్ చేశాడు. ‘చాలా తక్కువ జట్లు మాత్రమే 137 పరుగులను డిఫెండ్ చేసేందుకు ప్రయత్నిస్తాయి. అత్యుత్తమ బౌలింగ్ దళం కలిగిన పాక్ కు క్రెడిట్ ఇవ్వాలి’ అని హర్షాభోగ్లే ట్వీట్ ను షోయాబ్ అక్తర్ షేర్ చేసి ‘దీనినే తెలివైన ట్వీట్ అంటారు’ అని వ్యాఖ్యను జోడించారు.

తాజాగా షమీ-అక్తర్ వివాదంపై పాక్ మాజీ కెప్టెన్ షామిద్ అఫ్రిదీ స్పందించాడు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఏకంగా హితబోధ చేశాడు. ‘క్రికెటర్లుగా మనమంతా రాయబారులం. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. అంతేకానీ ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉండకూడదు. మనే ఇలా చేస్తే.. చదువుకోని సామాన్యుడు ఇంకెలా ఆలోచిస్తాడు.

వారి నుంచి ఇంకేమి ఆశిస్తాం.. అందుకే మనం బంధాలు నిర్మించాలి. అందులోనూ క్రీడలు కీలక పాత్ర పోషించాలి. భారత్ తో ఆడాలని కోరుకోవాలి. అలాగే ఆ జట్టు పాక్ లో పర్యటించాలని కోరుకుందాం. మీరు ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాడైతే అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు.  ఒకవేళ ఇప్పుడు జట్టు తరుఫున ప్లేయర్ అయితే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి’ అంటూ అఫ్రిది వ్యాఖ్యానించాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.