Begin typing your search above and press return to search.
అఫ్రిది వెర్సెస్ మియాందాద్...ముదిరిపోయింది!
By: Tupaki Desk | 11 Oct 2016 4:23 AM GMTఏమైందో ఏమిటో తెలియదు కానీ గత కొద్దిరోజులుగా పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ కు బూం బూం షాహిద్ అఫ్రిదీ కి మధ్య మాటల యుద్దం జరుగుతుంది. అయితే ఇది తాజాగా పీక్స్ కి చేరింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రిటైర్ అయిన అఫ్రిది... వీడ్కోలు మ్యాచ్ ఆడలేకపోవడం చాలా బాధకలిగించిందని కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించాడు. అయితే అఫ్రిది అలా అన్న కొద్ది గంటలకే స్పందించిన మియాందాద్... ఎవరూ ఊహించని కామెంట్స్ చేశాడు. "డబ్బుల కోసమే అఫ్రిది చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడు" అని కామెంట్ చేశాడు.
అయితే శనివారం ఒక కార్యక్రమానికి హాజరైన అఫ్రిది... తన వీడ్కోలు మ్యాచ్ స్పందనపై జావెద్ మియాందాద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. "మియాందాద్ గొప్ప క్రికెటర్.. ఆయన ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేస్తాడని ఊహించలేదు.. అందుకే ఎంత ఆట తెలిసినా ఈయన ఇమ్రాన్ ఖాన్ లాగా మంచిపేరు సంపాదించుకోలేకపోయాడు" అని చురకలు వేశాడు. దీంతో ఆ మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టిన మియాందాద్ గతాన్ని తోడుతూ అఫ్రిదీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో దీంతో ఇద్దరి మధ్యా జగడం ముదిరినట్లైంది.
అఫ్రిది వ్యాఖ్యలపై స్పందించిన మియాందాద్ ఈసారి మరింతగా చెలరేగిపోయాడు... "షాహిద్ అఫ్రిది ఓ దొంగ.. కాసుల కోసం దేశాన్ని అమ్మేసిన దుర్మార్గుడు.." అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం కరాచీలో మీడియాతో మాట్లాడిన జావేద్ మియాందాద్... గతంలో ఒకసారి మ్యాచ్ ఫిక్సింగ్ డబ్బులు తీసుకుంటూ తనకు అఫ్రిది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని, ఒకవేళ తాను చెప్పేది నిజం కాదనుకుంటే అఫ్రిది తన కూతురి మీది ఒట్టేసి చెప్పాలని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/