Begin typing your search above and press return to search.
ముంబై కోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్ కుమారుడు
By: Tupaki Desk | 2 July 2022 8:37 AM GMTముంబైని కుదిపేసిన డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నెల రోజుల పాటు కస్టడీలో ఉన్న అతడిని ఎట్టకేలకు ఆధారాలు లేకపోవడంతో వదిలేశారు. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఆర్యన్ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టులో గురువారం ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు.-
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు తన బెయిల్ షరతుల ప్రకారం.. తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో సమర్పించాడు. ఇప్పుడు తనపై ఆధారాలు లేక కేసు కొట్టుడు పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ స్టార్ కొడుకు త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
2021 అక్టోబర్ 2న ముంబైలోని క్రూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరిగింది. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఉన్నట్లు ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. దీంతో ఆయనను కోర్టుకు హాజరుపర్చడంతో 14రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే దాదాపు 20 రోజులు జైలులు ఉన్న తరువాత ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించింది. తాజాగా కోర్టులో క్లీన్ చిట్ కూడా లభించింది.
ముంబై సమీపంలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వినియోగించాన్న అభియోగంపై షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై కేసు నమోదు చేసి పోలీస్ కస్టడీకి పంపించారు. ఆ తరువాత బెయిల్ పై బయటికి వచ్చిన ఇన్ని రోజుల తరువాత ఆర్యన్ ఖాన్ కు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వినియోగించలేదని తేలింది.
ఇక ఆర్యన్ ఖాన్ ను కుట్ర పన్ని అరెస్ట్ చేయించారని సమీర్ వాంఖడేపై అభియోగాలు మోపారు. వాంఖడేపై అనేక విమర్శలు వస్తున్నాయి. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసేందుకే క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ సహా పలువురిని అరెస్ట్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాక నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందినట్లు ఎన్సీపీ నేతలు ఆరోపించారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్రబిందువుగా మారారు.
ఈ క్రమంలోనే ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ గా వాంఖడే పదవీకాలం ముగియడంతో ఆయనను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)కు బదిలీ చేశారు. ఆర్యన్ ఖాన్ విషయంలో తగిన ఆధారాలు చూపించని కారణంగా సమీర్ వాంఖడే పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సిట్ దర్యాప్తులో పలు అవకతవకలు జరిగాయని తేలింది.