Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బాద్ షాకు ఎయిర్ పోర్ట్ లో ఝలక్!
By: Tupaki Desk | 12 Nov 2022 3:30 PM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. పఠాన్, జవాన్, టైగర్ 3(గెస్ట్ రోల్), డుంకీ. ఈ సినిమాలు చిత్రీకరణ దశలో వున్నాయి.
ఇదిలా వుంటే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను ముంబై విమానాశ్రయంలో కష్టమ్స్ అధికారులు అడ్డగించడం ఆసక్తికరంగా మారింది. షారుఖ్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి మైంబై వచ్చారు. ఇదే విషయాన్ని మానాశ్రయంలో వున్న ఏయిర్ ఇంటలిజెన్స్ యూనిట్ వర్గాలు తెలిపాయి.
షారుఖ్ వద్ద ఖరీదైన వాచీలు, వాటి కవర్లు ఉన్నాయి. ఈ వాచీల కోసం షారుఖ్ రూ. 6.83 లక్షల కష్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చింది. యూఏఈలోని ఎక్స్ పో సెంటర్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ సినిమా ఐకాన్, కల్చరల్ నరేటీవ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఇటీవల షారుఖ్ ఖాన్ దుబాయ్ వెళ్లారు. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. షారుఖ్ అతడి బృందాన్ని టీ -3 టెర్మినల్ వద్ద రెడ్ ఛానల్ దాటుతుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షారుఖ్ బ్యాగుని తనిఖీ చేశారు.
అతని బ్యాగులో ఖరీతైన వాచీలు, 6 బాక్సుల్లో రోలెక్స్ వాచీలు, స్పిరిట్ బ్రాండ్ వాచీలు, ఆపిల్ సిరీస్ వాచీలు లభించాయట. వీటితో పాటు వాటీల ఖాళీ పెట్టెలు కూడా ఉండటంతో దాదాపు గంట పాటు విమానాశ్రయంలో షారుఖ్ బ్యాగులతో పాటు వ్యక్తిగత సిబ్బందిపై సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో షారుఖ్ కస్టమ్ డ్యూటీ కింద 6.87 లక్షలు చెల్లించినట్టుగా తెలిసింది. ఉతయం 8 గంటల వరకు సోదాల పర్వం సాగిందని, షారుఖ్ తన క్రెడిట్ కార్డ్ నుంచే ఈ మొత్తాన్ని చెల్లించాడని తెలిసింది.
షారుఖ్ కు కష్టమ్స్ అధికారులు అడ్డుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2011లో విదేశీ వస్తువులని తీసుకురావడంతో షారుఖ్ కు 1.5 కోట్ల కష్టం జరిమానా విధించారట. ఇదిలా వుంటే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం మూడు భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న `పఠాన్`, అట్లీ కుమార్ రూపొందిస్తున్న `జవాన్`, రాజ్ కుమార్ హిరాణీ `డుంకీ` చిత్రాల్లో నటిస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.