Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: జైలుకు వెళ్లి కొడుకును కలిసిన షారుఖ్ ఖాన్
By: Tupaki Desk | 21 Oct 2021 6:22 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు కోసం జైలుకెళ్లాల్సిన వచ్చింది.. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో జైల్లో ఉన్న కొడుకు ఆర్యన్ ను షారుఖ్ కలిశాడు. ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై సెషన్స్ కోర్టు నిరాకరించడంతో తీవ్ర బాధలో ఉన్న ఆర్యన్ ను షారుఖ్ పరామర్శించాడు. తనయుడి అరెస్ట్ తర్వాత షారుఖ్ తొలిసారి బయట కనిపించాడు.
ఇప్పటికే ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ ను మూడు సార్లు కోర్టు తిరస్కరించింది. డ్రగ్స్ పెడ్లర్స్ తో ఆర్యన్ కు సంబంధాలున్నాయని.. అందుకు ఆధారాలను కూడా కోర్టుకు ఎన్సీబీ సమర్పించింది. ఓ హీరోయిన్ తో ఆర్యన్ చేసిన చాటింగ్ ను కూడా కోర్టు ముందుంచారు.
ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ఎన్సీబీ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆర్యన్ కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. చివరి వరకు ఆర్యన్ కు బెయిల్ వస్తుందని ఆశతో ఉన్న షారుఖ్ కుటుంబం.. ఇప్పుడు రాకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది.
ఇప్పుడు ముంబై హైకోర్టుపైనే షారుఖ్ ఆశలు పెట్టుకున్నారు. కొడుకు బెయిల్ కోసం షారుఖ్ ముంబై హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.
ముంబై నుంచి గోవాకు ఓ క్రూయిజ్ షిప్ వెళ్తోంది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతుందని డ్రగ్స్ కంట్రోల్ స్క్వాడ్ కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాస్తవానికి ఈ షిప్ సోమవారం ముంబయికి తిరిగి రావాల్సి ఉంది. కానీ గోవాలో ఎన్సీబీ అధికారుల మఫ్టీలో పర్యాటలకులుగా షిప్ లోకి ఎక్కారు. ఆ తరువాత డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 8 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. షిప్ ప్రయాణం ప్రారంభించగానే వీరిని పట్టుకున్నట్లు ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మీడియాకు తెలిపారు.
ఇందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు అర్భాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నట్లు ఎన్ సీబీ అధికారులు తెలిపారు. మొత్తంగా 8 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు వారు తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతోనే ఈ దాడి చేశామన్నారు. అయితే ఈ కేసులో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని, సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ పార్టీ నిర్వహణలో ఎవరెవరి హస్తం ఉందో విచారణ చేపడుతామన్నారు.