Begin typing your search above and press return to search.
ఎన్సీబీ ముందు సంచలన నిజాలు ఒప్పుకున్న ఆర్యన్ ఖాన్
By: Tupaki Desk | 9 Oct 2021 11:57 AM GMTక్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీకి సంబంధించిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం రిమాండ్ లో ఉంచి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ రిమాండ్ పై జైలులో ఉన్నాడు.
ఆర్యన్ తరుఫున న్యాయవాది సతీష్ మన్షిండే బెయిల్ దరఖాస్తును కోట కోర్టు శుక్రవారం తిరస్కరించడంతో సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్యన్, ఆర్భాజ్ మర్చంట్ ఎన్సీబీ విచారణలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆర్యన్ తాను చరాస్ తీసుకుంటానని క్రూయిజ్ పార్టీలో చరాస్ తీసకోవడం కోసం వెళ్లానని సంచలన నిజాన్ని బయటపెట్టినట్లు సమాచారం. కోర్టుకు ఎన్సీబీ సమర్పించిన పంచనామా రిపోర్టులో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారు.
అంతేకాకుండా.. ఆర్భాజ్ షూలో డ్రగ్స్ దాచిపెట్టాడని తేలింది. అతడి షూ నుంచి స్వయంగా 6 గ్రాముల చరాస్ పోలీసులకు తీసి ఇచ్చాడు. పంచనామా ప్రకారం.. ఎన్సీబీ అధికారి ఆశిష్ రంజన్ ప్రసాద్ తాజాగా ఆర్యన్, ఆర్భాజ్ ను ప్రశ్నించడానికి కారణం వారికి చెప్పారు. దీని తర్వాత ప్రసాద్ ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 50 గురించి వారిద్దరికీ వివరించాడు. ఎన్సీబీ కూడా వారు కోరుకుంటే ఆర్యన్ ఆర్భాజ్ లకు ఒక గెజిటెడ్ ఆఫీసర్ లేదా మేజిస్ట్రేట్ ముందు విచారణ జరుపుతామని చెప్పారు. దానికి వారిద్దరూ నిరాకరించారు.
ఈ క్రమంలోనే దర్యాప్తు అధికారి ఆర్యన్, ఆర్భాజ్ ల వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దీనికి ఎన్సీబీ అధికారులు ‘ఇద్దరూ నిషేధించబడిన డ్రగ్స్ కలిగి ఉన్నట్లు అంగీకరించారు. ఆర్బాజ్ తన బూట్లలో చరాస్ ఉన్నట్లు ఎన్సీబీ అదికారులకు చెప్పాడు. దీని తర్వాత ఆర్భాజ్ స్వయంగా షూస్ లో దాచి ఉంచిన జిప్ లాక్ పన్సును తీసి ఇచ్చాడు.
కాగా ఆర్యన్ తరుఫున న్యాయవాది సోమవారం బెయిల్ కోసం కొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. మొదట కోట కోర్టు ఆదేశం కాపీని చూస్తామని.. ఆ తర్వాత సోమవారం ఏమీ చేయాలో నిర్ణయించుకుంటామని చెప్పారు. ఆర్యన్ కు నేర నేపథ్యం లేదని మన్షఇండే శుక్రవారం వాదించారు.