Begin typing your search above and press return to search.
శైలజా కిరణ్ విచారణలో కీలక విషయాలు రికార్డ్!
By: Tupaki Desk | 7 Jun 2023 2:47 PM ISTమార్గదర్శి కేసు విషయంలో సీఐడీ దూకుడు పెంచుకుంటూ పోతుంది. ఇందులో భాగంగా మార్గదర్సై మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజా కిరణ్ ను విచారించారు. సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం.
సీఐడీ ఎస్పీ హర్ష వర్ధన్ రాజు, డీఎస్పీ రవికుమార్, మహిళా ఏసీపీతో కూడిన 27 మంది సభ్యులు గల అధికారుల బృందం ఈ విచారణలో పాల్గొంది.
అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు దర్యాప్తు ఊపందుకుంది. ఇటీవలే ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేసిన అధికారులు.. తాజాగా ఆయన కోడలు, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ను విచారించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రామోజీ రావు నివాసంలో ఈ విచారణ సాగగా... ఈ వ్యవహారం మొత్తాన్నీ వీడియో కెమెరాలు, ఫుట్ కెమెరాలతో రికార్డ్ చేశారని తెలుస్తుంది.
ఈ విచారణలో మార్గదర్శి సంస్థల ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారట. ఈ సందర్భంగా శైలజా కిరణ్ అందజేసిన డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలించిన సీఐడీ అధికారులు... ఛిట్ ఫండ్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆధారాలతో సహా దానికి సంబంధించిన వివరాలను శైలజా కిరణ్ ముందుంచారని తెలుస్తుంది.
ఈ క్రమంలో అవిరామంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సీఐడీ విచారణ కొనసాగింది. సుమారు పదిగంటల పాటు జరిగిన ఈ విచారణలో ఒకదశలో తీవ్ర ఒత్తిడికి గురయిన శైలజా కిరణ్... తనకు అనారోగ్య సమస్య ఉందని తెలియజేయడంతో డాక్టర్లతో పరీక్షలు చేయించారు. అనంతరం యధాతథంగా ఈ ప్రక్రియను పునఃప్రారంభించారు.
అయితే విచారణ అనంతరం స్పందించిన సీఐడీ డీఎస్పీ రవి కుమార్ స్పందిస్తూ... శైలజా కిరణ్ కొంత మేరకు సమాధానాలు ఇచ్చారని తెలిపారు.
ఈ క్రమంలో పూర్తిస్థాయిలో ఆమె విచారణకు సహకరించకపోవడంవల్ల... మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేయాలని సీఐడీ అధికారులు నిర్ణయించారని సమాచారం. ఇందులో భాగంగా... ఆమెకు అనుకూలంగా ఉన్న రోజే విచారించాలని భావిస్తున్నారు. ఈమేరకు త్వరలో మరోసారి నోటీసులు జారీ చేయనున్నారు.
మార్గదర్శిలో డిపాజిటర్ల నగదును ఇతరత్రా సంస్థలకు మళ్లించిన వ్యవహారంలో సంస్థ ఛైర్మన్ రామోజీ రావును ఏ1, శైలజా కిరణ్ ను ఏ2గా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా రామోజీ రావుకు చెందిన 793.50 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సీఐడీ అధికారులు అటాచ్ చేశారు.
కాగా... మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంస్థ యజమానులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హై కోర్డు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
ఈ సందర్భంగా... మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను, ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
సి.ఆర్.పి.సి. సెక్షన్ 406 రెడ్ విత్ 139 ఏ కింద పిటిషన్ దాఖలు చేశామని.. ఆర్టికల్ 139 ఏ కింద ఒక హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను మరో హైకోర్టుకు బదిలీ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని వివరించింది.