Begin typing your search above and press return to search.

రష్యా-ఉక్రెయిన్ వార్.. అణుబాంబు పేలితే అనుభవం ఇలా ఉంటుందా?

By:  Tupaki Desk   |   9 Nov 2022 2:30 AM GMT
రష్యా-ఉక్రెయిన్ వార్.. అణుబాంబు పేలితే అనుభవం ఇలా ఉంటుందా?
X
యుద్ధం అనేది ఎప్పుడు కూడా విషాదాన్ని నింపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలను పరిశీలిస్తే విషాదం తప్ప ఇంకేమీ ఉండదు. చరిత్రలో ఇప్పటికే కొన్నివేల సార్లు యుద్ధాలు జరిగాయి. వీటిలో కొన్ని మాత్రమే గొప్ప యుద్ధాలుగా చరిత్రలో లిఖించబడ్డాయి.

మహమ్మద్ ఘోరీ.. అలెగ్జాండర్.. చంద్రగుప్త మౌర్యుడి కాలం నాటి యుద్ధాలు కేవలం సైనికులు.. గజదళం.. అశ్వదళం.. కత్తులు.. బల్లెలతో జరిగేవి. నేటి యుద్ధాలతో పోలిస్తే అప్పటి యుద్ధాల్లో మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పుచ్చు. ఎప్పుడైతే మనిషి రివాల్వర్ కనుగొన్నాడో అప్పటి నుంచి జరిగిన యుద్దాల్లో ప్రాణనష్టం భారీగా పెరుగుతూ పోయింది.

ఇక అణుబాంబును ఎప్పుడైతే యుద్ధాల్లో వినియోగించడం ప్రారంభించారో అప్పుడే మనిషి తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు. ఒక అణుబాంబు పేలితే ఎంతటి దుష్ఫలితాలు ఉంటాయనేది రెండో ప్రపంచ యుద్ధం కళ్ళకు కట్టినట్లు చూపించింది. జపాన్లోని హీరోషియా.. నగసాకి నగరాలపై అమెరికా అణుబాంబును ప్రయోగించడంతో ఆ రెండు నగరాలు రెప్పపాటులో కకావికలమయ్యాయి.

ఈ యుద్ధంలో అమెరికా నెగ్గినప్పటికీ ప్రపంచం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఈ అణుబాంబు మిగిల్చిన విషాదం భవిష్యత్ తరాలను కూడా వెంటాడింది అంటే అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఈ యుద్దం తర్వాత చాలా దేశాలు సొంతం అణుబాంబులను తయారు చేసుకోవడం ప్రారంభించారు.

ఇప్పుడు చాలా దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయి. రెండు అణుబాంబు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది యావత్ ప్రపంచంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత పది నెలలు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. రష్యా వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఉక్రెయిన్ అణుబాంబు లేకపోయినప్పటికీ శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలోనే ఇరుదేశాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సైనికులు.. ఆయా దేశాల అమాయక ప్రజలు ఈ యుద్ధంలో ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే వేలాది మంది సైనికులు తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. ఉక్రెయిన్ కు నాటో దేశాలు ఇన్ డైరెక్టుగా సపోర్టు చేస్తుండటంతో ఇప్పట్లో యుద్ధం కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

ఇకపోతే రష్యా దేశం ఉక్రెయిన్ పై అణుబాంబుతో దాడి చేస్తుందనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. మరోవైపు రష్యా ఉక్రెయిన్ ను తన దారికి తెచ్చుకోవాలని చూస్తుందే తప్ప అణుబాంబు దాడి చేసే అవకాశం లేదనే వాదనలు కూడా విన్పిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అణుబాంబు దాడి జరిగితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అనుభవంలోకి రావడం ఖాయం.

అణుబాంబు వర్చువల్ వీడియో పాతదే అయినప్పటికీ రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ప్రశాంతంగా ఉన్న బీచ్ లో ఆకస్మాత్తుగా అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో ఈ వీడియో అనుభవంలోకి తెస్తోంది. అణుబాంబు పడిన చోట నింగికి ఎగిసిన భారీ పేలుడు.. పొగ.. ధూళి ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మివేయడం కన్పించింది. అణుబాంబు దెబ్బకు ఆకాశం రంగు మారిపోయింది. చెట్టు.. చేమ.. పుట్ట ఏమాత్రం మిగలకుండా బుగ్గిపాలవడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.