Begin typing your search above and press return to search.
తాజా..తాజా: ఒక్కరోజులో రూ.50వేలు విత్ డ్రా
By: Tupaki Desk | 14 Nov 2016 7:14 AM GMTచేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన్ని గుర్తు చేసేలా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై కాస్త ఆలస్యంగా స్పందించిన మోడీ.. దిద్దుబాటు చర్యల్ని చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం.. చిల్లర కోసం పడుతున్న కష్టాలతో పాటు.. నగదును విత్ డ్రా చేసుకోవటపై వారు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రత ఆయనకు పూర్తిగా అర్థమైంది. పెద్దనోట్ల రద్దు వరకూ అంతాబాగానే ఉన్నా.. సామాన్యులకు వారి డబ్బును వారు తిరిగి తీసుకోవటానికి పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ప్రధాని అలాంటి వాటిని చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం అర్థరాత్రి వేళ కీలక అధికారులతో.. మంత్రులతో సమావేశమైన ఆయన.. ప్రజల కష్టాల్ని తగ్గించే మార్గాలపైనా.. సమస్యల పరిష్కారంపైనా దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఈ నెల 24 వరకూ ఆసుపత్రులు.. రైల్వే స్టేషన్లు.. విమానాశ్రయాలు.. పెట్రోల్ బంకులు.. మెడికల్ షాపుల్లో పాత నోట్ల చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకున్న ఆయన.. మరికొన్ని నిర్ణయాల్ని కూడా తీసుకున్నట్లు అర్థమవుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దేశ వ్యాప్తంగా ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయటానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయటంతో పాటు.. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని.. విత్ డ్రా మొత్తాన్ని పెంచిన విషయాన్ని ప్రకటించారు.
సరైన కారణం చూపించి రూ.50వేల వరకూ నగదును విత్ డ్రా చేసుకునేలా కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాదు.. బ్యాంకులో రోజుకు ఎన్నిసార్లు అయినా నగదు జమ చేసుకోవచ్చని.. దీనికి ఎలాంటి పరిమితి లేదన్న ఆయన.. రూ.2.5లక్షలు దాటితే మాత్రం ఆధారాలు చూపించాలని స్పష్టం చేశారు. అదే సమయంలో నగదు విత్ డ్రా చేసే మొత్తాన్ని సాధారణ పరిస్థితుల్లో రూ.24వేలకు పెంచినట్లుగా పేర్కొన్నారు. గతంలో ఇది రూ.10వేలు వరకూ మాత్రమే ఉండేది.
అంతేకాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో కొత్త రూ.500నోట్లను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. దేశ వ్యాప్తంగా మైక్రో ఏటీఎంలు.. మొబైల్ ఏటీఎంలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.తాజాగా వెల్లడించిన నిర్ణయాల్ని చూస్తుంటే.. జనం పడుతున్న పాట్లు కేంద్రం దృష్టికి వెళ్లినట్లుగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/