Begin typing your search above and press return to search.
పవన్ కి మద్దతు ఇద్దామా... ?
By: Tupaki Desk | 24 Jan 2022 12:30 AM GMTవచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకు చాలా ముఖ్యమైనవి అని చెప్పాలి. ఈ ఎన్నికల్లో రెండవ మారు గెలవకపోతే వైసీపీకి కూడా ఎక్కడ లేని ఇబ్బందులు వచ్చేస్తాయి. ఒక్క చాన్స్ అంటూ వచ్చిన పార్టీ ఆ ఒక్క చాన్స్ తోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. మరో వైపు టీడీపీ సీన్ ఇంకా ఇబ్బంది అనే చెప్పాలి. టీడీపీకి సీనియర్ మోస్ట్ నేత చంద్రబాబు నాయకుడు. ఆయన అనుభవం తీసుకుంటే ప్లస్ అవుతూంటే వయసు మైనస్ గా ఉంది.
నిజానికి 2019 నాటికే మళ్ళీ టీడీపీకి పవర్లోకి తెచ్చి వారసుడికి బాధ్యతలు అప్పగించాలని బాబు అనుకున్నారని ప్రచారం సాగింది. కానీ అది కాస్తా రివర్స్ అయింది. దాంతో బాబు 2024 నాటికి కూడా తానే టీడీపీకి నాయకత్వం వహించే స్థితిలో ఉన్నారు. ఈసారి చావో రేవో అన్నట్లుగా టీడీపీకి పరిస్థితి ఉంటుంది అన్నది నిజం. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా సైకిల్ పార్టీ కధ కూడా ఏమవుతుందో అన్న కంగారు అందరిలో ఉంది.
మూడవ పార్టీగా జనసేన ఉంది. ఆ పార్టీ పెట్టి 2024 నాటికి పదేళ్ళు అవుతుంది. ఇక ఎన్నికల గోదాలోకి దిగడం అప్పటికి రెండవసారి అవుతుంది. ఒక కొత్త పార్టీకి ఇవన్నీ కొత్త ప్రయోగాలే. అయితే పవన్ కి ఉన్న సినీ చరిష్మా వల్ల, బలమైన సామాజికవర్గం కారణంగానూ ఆయన పార్టీ ఏపీలో ఇంకా సాగుతోంది. మొత్తానికి 2024 ఎన్నికల మీద అయితే జనసైనికులకు చాలా ఆశలు ఉన్నారు. అయితే కింగ్ లేకపోతే కింగ్ మేకర్ అన్న ఆలోచనతోనే జనసేన ఈసారి బరిలోకి దిగుతుంది అంటున్నారు.
మరి జనసేనకు బలమైన మద్దతు ఎక్కడ నుంచి వస్తుంది అంటే సొంత సామాజికవర్గం నుంచే రావాలి. ఏపీలో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా ఓటేయాలీ అంటే ఆ సామాజికవర్గానికి చెందిన రాజకీయ నాయకులు కూడా ముందుగా జనసేనకు మద్దతు ఇవ్వాలి. మరి జనసేనకు మద్దతు అంటే కాపు నాయకులు కూడా ఆలోచిస్తున్నారు అని టాక్. ఎందుకంటే వారంతా రాజకీయాల్లో పండిపోయిన వారే.
వారి స్వీయ రాజకీయం కూడా ఇందులో ఇమిడి ఉంటుంది. పైగా ఇపుడు అధికార వైసీపీలో ఉన్న కాపు నాయకులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు మద్దతు ఇవ్వరు. వారికి అధికారం చేతిలో ఉంది. రేపటి రోజున వారికి పదవులు లేక టికెట్ రాకపోతే ఏమో ఆలోచించాలి. దాంతో విపక్షంలో ఉన్న వారే మద్దతు గురించి ఆలోచిస్తున్నారు. ముందుగా టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి చూసుకుంటే మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఇదే విషయమై ఎడతెరపి లేని తీరులో సమాలోచనలు జరుపుతున్నారు.
ఈ మధ్యనే వారంతా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. వర్చువల్ గా తాజాగా మరోసారి కలసి ఏపీ రాజకీయాల మీద సుదీర్ఘంగా చర్చించారు అని టాక్. ఈ సమావేశంలో ప్రధాన అజెండా ఏంటి అంటే పవన్ కి మద్దతు ఇద్దమా. ఇస్తే ఎలా ఉంటుంది రాజకీయం మూడవ పార్టీగా జనసేన అటు టీడీపీ, ఇటు వైసీపీల పోటీని గట్టిగా తట్టుకుని ముందుకు వస్తుందా అన్న చర్చ సాగిందట.
అలా కాకుండా తాము ఉంటున్న పార్టీలోనే కాపులకు మరింత ప్రాధాన్యత వచ్చేలా చేసుకుందా అన్న ఆలోచన మీద కూడా చర్చించారని అంటున్నారు. అయితే గంటల పాటు సాగినా కూడా నిర్ణయం అయితే తీసుకోకుండా సమావేశం ముగిసింది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ రాజకీయం ఇంకా పక్వానికి రాలేదు అన్నది రాజకీయ నేతల మాటగా ఉంది. అదే టైమ్ లో జనసేనకు కాపులు పూర్తిగా మద్దతు ఇస్తే రేపటి ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగానే ఉంది.
ఒకవేళ తాము మద్దతు ఇచ్చినా జనసేన మెయిన్ స్ట్రీమ్ లో నిలబడకపోతే ఈ ఓట్ల చీలిక వల్ల మళ్ళీ వైసీపీ పవర్ లోకి వస్తే అన్న ఆలోచనలూ ఉన్నాయట. ఇక ఏపీలో ఈ రోజుకీ చూసుకుంటే వైసీపీ వర్సెస్ టీడీపీగానే సీన్ ఉంది అంటున్నారు. ఈ మధ్య వచ్చిన ఒక జాతీయ సర్వేలో అదే విషయం తేటతెల్లమైంది. మరి సమయంలో మూడవ పార్టీగా జనసేన ఎంతవరకూ ఎమర్జ్ అవుతుంది అన్నది కూడా తలపండిన కాపు నేతలు ఆలోచన చేస్తున్నారని టాక్. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ మళ్ళీ రాకూడదు అన్నది ఒకటి అయితే కాపులకు అధికారం దక్కాలీ అన్నది మరోటీ. మరి ఇలా చాలా అంశాల మీద బ్యాలన్స్ కుదిరేవరకూ ఈ చర్చలు సాగుతూనే ఉంటాయని అంటున్నారు.