Begin typing your search above and press return to search.

అనంత‌లో టీడీపీకి ఇంకో ఝ‌ల‌క్ - జంట రాజీనామాలు?

By:  Tupaki Desk   |   13 March 2020 1:30 PM GMT
అనంత‌లో టీడీపీకి ఇంకో ఝ‌ల‌క్ - జంట రాజీనామాలు?
X
ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ లో అంత‌గా కనిపించ‌డం లేదు ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల మాజీ ఎమ్మెల్యే అయిన శ‌మంత‌క‌మ‌ణి తెలుగుదేశం పార్టీని వీడ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆమె కూతురు యామినీ బాల కూడా శింగ‌న‌మ‌ల‌కు ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వీరి కుటుంబానికి టికెట్ ద‌క్క‌లేదు. జేసీ కుటుంబం తెర మీద‌కు తెచ్చిన బండారు శ్రావ‌ణికి తెలుగుదేశం పార్టీ టికెట్ ద‌క్కింది. అయితే ఆమె నెగ్గుకురాలేక‌పోయారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీచేసిన జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి భారీ మెజారిటీతో శింగ‌న‌మ‌ల‌లో జ‌య‌కేత‌నం ఎగ‌రేశారు.

తాడిప‌త్రికి ఆనుకుని ఉండే శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో జేసీ కుటుంబం రాజ‌కీయం సాగిస్తూ ఉంది. బండారు శ్రావ‌ణి అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే రాజ‌కీయంగా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ త‌మ‌కు ద‌క్క‌క‌పోవ‌డంతోనే శ‌మంత‌క‌మ‌ణి-యామిని బాల కినుక వ‌హించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదో నామ‌మాత్రంగా ప‌ని చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవ‌డంతో వారికి ఎలాంటి ప్రాధాన్య‌త స‌హ‌జంగానే ఉండ‌దు.

శ‌మంత‌క‌మ‌ణి గ‌తంలో కాంగ్రెస్ నేతే. కాంగ్రెస్ ప‌ని చేసి ఆ త‌ర్వాత ఆమె తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అయితే ఆమె తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున అంత‌గా రాణించ‌లేక‌పోయారు. 2014 ఎన్నిక‌ల్లో మాత్రం ఆమె కూతురు ఎమ్మెల్యేగా నెగ్గారు. రెండోసారి టికెట్టే ద‌క్క‌లేదు. ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ శాస‌న‌మండ‌లి స‌భ్యుల‌కు విప్ జారీ చేసి, మండ‌లి స‌మావేశాల‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశించినా శమంత‌క‌మ‌ణి ఖాత‌రు చేయ‌లేదు. చంద్ర‌బాబు నాయుడు త‌మ‌కు ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌లేద‌ని - ద‌ళితుల‌ని త‌మ‌ను తొక్కేస్తున్నార‌ని అసంతృప్తితో ఉన్నార‌ట శ‌మంత‌క‌మ‌ణి - యామినీబాల‌. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల ఊపులో వారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి - మ‌రో పార్టీలోకి చేరిపోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.