Begin typing your search above and press return to search.
షేమ్ ఆన్ బీసీసీఐ..భారత క్రికెట్ బోర్డును కడిగేశారు
By: Tupaki Desk | 29 March 2020 5:30 PM GMTకరోనా వ్యాప్తిని దేశంలో అరికట్టడానికి.. కరోనాపై పోరాడడానికి దాతలు విరాళం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ నిన్న పిలుపునిచ్చాడు. దీంతో బాలీవుడ్ అగ్రహీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్ల రూపాయల విరాళం అందజేసి గొప్ప ఉదారత చాటుకున్నాడు. మోడీ ప్రత్యేకంగా అక్షయ్ కుమార్ ను అభినందించారు.
ఒక్క హీరోనే 25 కోట్లు ఇచ్చినప్పుడు ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఎంతవ్వాలి. ఒక్క ఐపీఎల్ ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్న బీసీసీఐ మొదట సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇక ఏటా 800 కోట్లు అందుకుంటున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తక్కువ మొత్తం సాయం చేయడంపై నెటిజన్లు ఆయనను ట్రోల్ చేసి ఎండగట్టారు. దేశం కోసం ఆ మాత్రం సాయం చేయలేవా అని కడిగిపారేశారు.
ఈ కోవలోనే ధనిక బోర్డు బీసీసీఐ సాయం చేయకుండా కామ్ గా ఉండడంపై మండిపడ్డారు. ట్విట్టర్ లో ‘షేమ్ ఆన్ బీసీసీఐ’ అనే హ్యాష్ ట్యాగ్ తో బీసీసీఐని కడిగిపారేశారు. అన్ని వైపులా విమర్శలు రావడంతో బీసీసీఐ అప్పటికప్పుడు స్పందించి రూ.50 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
అయితే వేల కోట్లు సంపాదిస్తూ 50 కోట్లు మాత్రమే విరాళం ఇవ్వడంపైన కూడా బీసీసీఐపై నెటిజన్లు ఎదురుదాడి చేశారు. ఇప్పటికే సౌత్ సెంట్రల్ - ఎస్. టీ రైల్వే ఉద్యోగులు తమ ఒక్కరోజు జీతం రూ.70 కోట్లను ప్రధాని నరేంద్రమోడీ నిధికి విరాళంగా అందజేశారు. ధనిక బోర్డు కేవలం 51 కోట్లు మాత్రమే విరాళం ఇస్తుందా అని బీసీసీఐని చెడుగుడు ఆడేస్తున్నారు. ఇలా విరాళం ఇవ్వకున్నా.. ఇప్పుడు తక్కువగా ఇచ్చినా బీసీసీఐకి మాత్రం అవమానాలు తప్పడం లేదు.