Begin typing your search above and press return to search.
పాక్ అభిమానికి షమీ సీరియస్ వార్నింగ్ .. ఆ వీడియో వైరల్ !
By: Tupaki Desk | 26 Oct 2021 7:51 AM GMTటీ20 వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్థాన్ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఓపెనర్లు రోహిత్, రాహుల్ లు రాణించలేదు. ప్రధాన బౌలర్లెవరూ ఒక్క వికెటూ తీయలేదు. గొప్ప బౌలర్ గా పేరున్న బుమ్రా కూడా వికెట్ పడగొట్టలేదు. కానీ, అంతా మహ్మద్ షమీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియాలో అతడిని ట్రోల్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలిచారు.
ఈ క్రమంలోనే 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ మ్యాచ్ లోనూ భారత్ పై పాక్ గెలిచింది. టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లే క్రమంలో ఓ పాక్ అభిమాని ‘బాప్ కౌన్ హై.. బాప్ కౌన్ హై’ అంటూ దూషించాడు. కోహ్లీ, రోహిత్, ధోనీ సహా జట్టు సభ్యులంతా మౌనంగా వెళ్లిపోయారు. కొద్ది దూరం వెళ్లాక షమీ వెనక్కొచ్చి దూషించిన పాక్ అభిమానికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. నాటి కెప్టెన్ ధోనీ వెంటనే అతడిని వారించాడు. డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ వీడియోను పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. నాడు షమీ ఒక్కడే మాట్లాడాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అభిమానులు ఈ వీడియోను పోస్టు చేస్తూ దేశం పట్ల షమీకి ఉన్న అంకితభావం ఇలాంటిదని అండగా నిలుస్తున్నారు.
ఇక టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఆ తర్వాత కొందరు సోషల్ మీడియా వేదికగా టీం ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని టార్గెట్ చేశారు. ఓటమికి మహ్మద్ షమీనే కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. షమీ పాక్ కు అమ్ముడుపోయాడు, అతన్ని పాక్ కు తరిమికొట్టాలంటూ భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే షమీకి మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, రాజకీయ నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు అభిమానులు కూడా పేసర్ కు అండగా నిలుస్తున్నారు

Those calling @mdshami11 a #gaddar after the #IndiaVsPak match, please watch this 2017 video, when after losing to Pakistan, only Shami had the courage to confront the bullying Pakistani. #IndvsPak #shami #Kohli #ICCT20WorldCup #RohithSharma pic.twitter.com/8ixvhbJadP
— निंदाTurtle (@Tawishz) October 25, 2021