Begin typing your search above and press return to search.
నడుముకు టవల్ కట్టుకొని ఫీల్డింగ్ చేయటమా? ఇంతకీ ఎవరంటే?
By: Tupaki Desk | 24 Jun 2021 7:30 AM GMTక్రికెట్ మైదానంలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక విచిత్రం చోటు చేసుకుంది. టీమిండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ టెస్టు ఫైనల్ మ్యాచ్ లో ఈ సిత్రం చోటు చేసుకుంది. రసవత్తరంగా సాగాల్సిన మ్యాచ్.. పాడు వర్షం కారణంగా సరిగా జరగకపోవటం.. పదే పదే అంతరాయం కలగటం తెలిసిందే. మ్యాచ్ తుది ఫలితం టీమిండియాకు అనుకూలంగా రాకపోవటంతో నిరాశలో జట్టు సభ్యులు ఉన్నారు. అభిమానులు సైతం డిసప్పాయింట్ మెంట్ కు గురయ్యారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మ్యాచ్ మధ్యలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన చేష్టలతో అందరిని ఆకట్టుకోవటమే కాదు.. ముఖాల్లో నవ్వులు పూయించాడు. అప్పటికే మ్యాచ్ చప్పగా సాగుతూ.. నీరసంగా ఉన్న వేళ.. షమీ చేసిన పని అందరిని ఆకర్షించింది. చివరి రోజు ఆట మధ్యలో తన బౌలింగ్ పూర్తి అయిన తర్వాత షమీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కోసం వెళ్లాడు.
డ్రింక్స్ తీసుకొచ్చిన రిజర్వ్ ఆటగాడి నుంచి వాటర్ తీసుకొని తాగిన షమీ.. అనంతరం చెమటను తుడుచుకునేందుకు టవల్ తీసుకున్నాడు. అనంతరం ఆ టవల్ ను నడుముకు కట్టుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. నడుముకు టవల్ కట్టుకొని కాసేపు ఫీల్డింగ్ కూడా చేయటం గమనార్హం. లక్కీగా అతడు టవల్ కట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న వేళ.. అతడి వైపు బంతి రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే.. ఎలా పరిగెత్తేవాడో అన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ నడుముకు టవల్ ఎందుకుకట్టుకున్నట్లు? అన్న ప్రశ్నకు ఎవరికి తోచిన సమాధానం వారు ఇస్తున్నారు.
కొందరు వర్షం పడితే తుడుచుకోవటానికి ముందే టవల్ తన దగ్గర ఉంచుకున్నాడని చెబితే.. అదేమీ కాదు బోరింగ్ గా మారిన సీన్ ను కాస్తంత హుషారు ఎక్కించేందుకే అలా చేసి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. నడుముకు టవల్ కట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.