Begin typing your search above and press return to search.

వరల్డ్ టాప్100 ఎయిర్ పోర్టుల్లో మన 'శంషాబాద్'

By:  Tupaki Desk   |   23 Jun 2022 3:32 AM GMT
వరల్డ్ టాప్100 ఎయిర్ పోర్టుల్లో మన శంషాబాద్
X
విమానాశ్రయ రంగంలో సైటాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డులు ప్రతిష్టాత్మకమైనవి. వీటిని కస్టమర్ లు వార్షిక గ్లోబల్ ఎయిర్ పోర్ట్ కస్టమర్ సాటిస్ ఫాక్షన్ సర్వే ద్వారా ఎన్నుకుంటారు. 550కు పైగా విమానాశ్రయాల్లో కస్టమర్ సేవా మరియు సౌకర్యాలను అంచనావేస్తూ ప్రపంచ విమానాశ్రయ పరిశ్రమకు నాణ్యమైన బెంచ్ మార్క్ గా ఈ అవార్డులను పరిగణిస్తారు. ఈ సర్వే, అవార్డులు ఏ విమానాశ్రాయ నియంత్రణకూ లోబడకుండా స్వతంత్రంగా నిర్వహించబడుతాయి.

6 నెలల సర్వే వ్యవధిలో 100 కంటే ఎక్కువ దేశాల విమానాశ్రయ కస్టమర్లు పూర్తి చేసిన వరల్డ్ ఎయిర్ పోర్ట్ సర్వే ప్రశ్నాపత్రాల ఆధారంగా అవార్డులు అందించబడ్డాయి.

చెక్-ఇన్, రాకపోకలు, బదిలీలు, షాపింగ్, భద్రత మరియు ఇమ్మిగ్రేషన్ నుంచి గేట్ వద్ద బయలు దేరే వరకూ ఎయిర్ పోర్ట్ సర్వీస్ యొక్క కస్టమర్ల అనుభవాన్ని , ఉత్పత్తి కీలక పనితీరు సూచికలను ఈ సర్వే ద్వారా పరిశీలించారు.

ప్రపంచంలో అత్యుత్తమ 100 విమానాశ్రయాల్లో భారత్ కు చెందిన 4 విమానాశ్రయాలకు చోటు దక్కింది. స్కైట్రాక్స్ తాజా నివేదికలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం 37వ స్థానంలో.. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం 61వ స్తానంలో, హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు 63వ స్థానంలో.. ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయం 65వ స్థానంలో నిలిచాయి. మరే ఇతర భారతీయ విమానాశ్రయానికి టాప్ 100 లో చోటు దక్కలేదు.

100 దేశాల్లో 550కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు చెక్ ఇన్, రాకపోకలు, బదిలీలు, ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్, షాపింగ్, భద్రత విభాగాల్లో అందిస్తున్న సేవలకు గాను ఈ పురస్కారాన్ని అందించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇందులో 2021లో 64వ స్థానం నుంచి 2022లో 63వ స్థానానికి చేరుకుంది. దక్షిణాసియా 2022లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయాల్లో రెండో ర్యాంక్ సాధించింది.