Begin typing your search above and press return to search.
‘‘షాన్ ఇ పంజాబ్’’ ట్రైన్ ప్రత్యేకత తెలుసా?
By: Tupaki Desk | 9 April 2016 9:20 AM GMTమొన్నటికి మొన్న గతిమాన్ రైలు పట్టాలు ఎక్కి ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇవ్వటం తెలిసిందే. ఇదే తీరులో మరో ట్రైన్ పట్టాలెక్కింది. గతిమాన్ మాదిరి కాకుండా.. తాజా కొత్త రైలులో భద్రతకు పెద్దపీట వేశారు. రైలు మొత్తాన్ని సీసీ కెమేరాలతో నింపేసి.. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా సాంకేతికత ఈ ట్రైన్ ప్రత్యేకత. ఢిల్లీ నుంచి అమృత్ సర్ కు ప్రయాణించే ఈ ట్రైన్ ను ‘షాన్ ఇ పంజాబ్’గా వ్యవహరిస్తున్నారు.
మొత్తం 21 బోగీలున్న ఈ ట్రైన్ లో మొత్తం 122 సీసీ కెమేరాలతో నింపారు. అంటే.. ట్రైన్ లో జరిగే ప్రతి విషయం దాదాపు రికార్డు అయ్యే పరిస్థితి. ఈ మొత్తం కెమేరాల్ని ట్రైన్ లోని గార్డు రూమ్ తో అనుసంధానించారు. ఈ సీసీ కెమేరా ఫుటేజ్ నెల రోజుల పాటు అందుబాటులో ఉండనుంది. రైల్లో జరిగే నేరాలకు చెక్ పడటంతో పాటు.. ప్రయాణికుల భద్రతకు సీసీ కెమేరాల ఏర్పాటు భరోసా ఇస్తుందనే చెప్పాలి. రూ.36లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమేరాల కారణంగా నేరాలు మాత్రమే కాదు.. రైల్వే సిబ్బంది ప్రయాణికులతో వ్యవహరించే తీరును పరిశీలించేందుకు.. ప్రయాణికులు రైల్వే సిబ్బందితో గొడవపడినా తెలిసే వీలుంది. ఈ సీసీ కెమేరాలు రైల్వే టీసీలకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టనున్నాయా?