Begin typing your search above and press return to search.
రిటైరైనా... వార్న్ లో రసికత తగ్గలేదబ్బా
By: Tupaki Desk | 2 Sep 2019 1:30 AM GMTక్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటే... ఆ జట్టు సభ్యుడిగా కొనసాగిన విఖ్యాత లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ కు కూడా ఈ క్రీడలో ఓ ప్రత్యేకత ఉందనే చెప్పాలి. అంతేనా... క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వార్న్... రసికతలోనూ తనకు ఓ స్పేషల్ ఇమేజీని క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి. గర్ల్ ఫ్రెండ్స్ - సెక్స్ వర్కర్స్ అన్న తేడా లేకుండా చాలా మందితో సరస సల్లాపాల్లో మునిగితేలిన వార్న్... క్రికెట్ ఆడుతుండగానే ఓ సారి అడ్డంగా బుక్కై వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పేసినా... తన రసికతను మాత్రం అతడు వదలలేదనే చెప్పాలి.
రసికతకు రిటైర్మెంట్ ఎం ఉంటుందంటారా? సరే... ఈ క్రీడకు రిటైర్మెంట్ లేకున్నా... హద్దులంటూ పాటించాలి కదా. ఇప్పుడు వార్న్ కూడా ఆ హద్దులను పాటించకుండానే మరోమారు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అయినా ఇప్పుడు వార్న్ ఏం చేశాడన్న విషయానికి వస్తే... తన లవర్ తో పాటు మరో ఇద్దరు సెక్స్ వర్కర్లతో ఈస్ట్ లండన్ లోని తన ఖరీదైన నివాసంలో పార్టీ చేసుకుని పక్కింటివారికి చికాకు తెప్పించాడట. గత మంగళవారం జరిగిన ఈ సంఘటనను సన్ పత్రిక సవివరంగా బయటపెట్టింది. డవీనా(19) - పాపీ (27) అనే ఇద్దరు సెక్స్ వర్కర్లతో కలిసి వార్న్ ప్రేమికురాలు అతడి ఇంటిలోకి ప్రవేశించిన వెంటనే మొదలైన పార్టీ దాదాపుగా రెండు గంటలపాటు సాగిందట.
గర్ల్ ఫ్రెండ్ - సెక్స్ వర్కర్లతో పార్టీ సరే.. ఆ పార్టీని అయినా కాస్త నాలుగ్గోడల మధ్య జరుపుకోవాలి కదా. అందుకు భిన్నంగా వ్యవహరించిన వార్న్... ఇంటి కిటికీ తలుపులన్నీ తెరిచి పెట్టి మరి సరస సల్లాపాల్లో మునిగిపోయాడట. దీంతో లోపల జరుగుతున్న తతంగమంతా పక్కింటి వాళ్లకు చాలా క్లియర్ గానే కనపడిపోయింది. ఏదో మాజీ క్రికెటర్ లే అనుకుని ఆ డిస్లర్బెన్స్ ను కొద్ది సేపు చూసి చూడనట్టుగా వ్యవహరించిన ఇరుగుపొరుగు... వార్న్ ఎంతకూ తన కామక్రీడలకు ఫుల్ స్టాప్ పెట్టకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన వారంతా ఓ న్యూస్ ఛానెల్ కు సమాచారం అందించారట. దీంతో పరుగులు పెట్టిని సదరు న్యూస్ ఛానెల్ వార్న్ బాగోతాన్ని బాగానే రికార్డు చేసిందట. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.