Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ జట్టుపై షేన్ వార్న్ షాకింగ్ కామెంట్స్..

By:  Tupaki Desk   |   9 Jan 2022 11:30 AM GMT
పాకిస్థాన్ జట్టుపై షేన్ వార్న్ షాకింగ్ కామెంట్స్..
X
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ పాకిస్థాన్ పై సంచలన కామెంట్స్ చేశాడు. పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సలీం మాలిక్ తనకు లంచం ఇచ్చేందుకు ట్రై చేశాడని అన్నారు. మైదానంలోకి వచ్చిన తరువాత సరైన ప్రతిభ చూపించొద్దని, తనతో పాటు మరో ఆసిస్ ఆటగాడికి కూడా వార్నింగ్ ఇచ్చారన్నారు. అయితే ఈ విషయాన్ని తాను నాటి కెప్టెన్ మార్క్ టేలర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపాడు. షేన్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు మొదలయ్యాయి.

అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే షేన్ వార్న్ తాజాగా మరో బాంబ్ పేల్చాడు. తన డాక్యుమెంటరీ 'షేన్' త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి నిజమా..? కాదా..? అనేది తెలియాల్సి ఉందన్న చర్చ సాగుతోంది. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

'1994 సంవత్సరంలో పాక్ పర్యటన చేశాం. అప్పుడు కరాచీ వేదికగా టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ సలీం మాలిక్ తనను ఓగదిలో కలిశాడు. అప్పటికే 145 టెస్టులను ఆడిన తనకు ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తనకు 2,76,000 అమెరికల్ డాలర్లు ఆఫర్ చేశాడు. సామర్థ్యం మేరకు ఆడకూడదన్నాడు. అంతేకాకుండా వికెట్లు తీసే ప్రయత్నం చేయకుండా వైడ్ బంతులు విసరాలన్నారు. నాతో పాటు టిమ్ మే కు కూడా వేరే రకంగా ఆఫర్ తో పాటు వార్నింగ్ కూడా ఇచ్చాడు.

తమ జట్టు ఓటమి అంచులో ఉందని, అదే జరిగితే తమ ఇళ్లపై దాడులు జరుగుతాయని చెప్పారు.అయితే ఈ విషయాన్ని నాటి ఆసిస్ కెప్టెన్ మార్క్ టేలర్ దృష్టికి తీసుకెళ్లాం. ' అని తెలిపారు. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే షేన్ వార్న్ చేసిన ఈ పలుకులపై నిజమో, కాదో తెలియాల్సి ఉంది. మరోవైపు పాక్ క్రికెట్ జట్టులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.