Begin typing your search above and press return to search.
ఆ లిక్విడ్ డైట్ వల్లే షేన్ వార్న్ మరణం?
By: Tupaki Desk | 7 March 2022 11:30 PM GMTప్రపంచ ప్రఖ్యాత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి అసలు కారణం ఏంటో తెలిసింది. బరువు తగ్గాలనే ఆలోచనే ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణానికి కారణమని అతడి మేనేజర్ జేమ్స్ ఎర్స్ కిన్ తెలిపాడు. బరువు తగ్గడానికి వార్న్ అర్థం పర్థం లేని దారుణమైన డైట్ లు ఫాలో అయ్యాడని తెలిపారు. మరణానికి ముందు 14 రోజులుగా కేవలం ద్రవరూపంలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకున్నాడని.. గతంలో కూడా ఈ డైట్ ఫాలో అయ్యాడని చెప్పుకొచ్చాడు.
థాయ్ లాండ్ లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్ కు వెకేషన్ కు వెళ్లిన 52 ఏళ్ల షేన్ వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం షాక్ కు గురైంది.
షేన్ వార్న్ మరణంపై థాయ్ లాండ్ పోలీసులు జరిపిన విచారణలో కొత్త ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. షేన్ వార్న్ విల్లా గదిలో ఫ్లోర్ తోపాటు టవల్ పై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. థాయ్ లాండ్ కు రాకముందే వార్న్ చాతినొప్పితో బాధపడ్డాడని.. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం డాక్టర్ ను కలిసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. వార్న్ మరణాన్ని అనుమానాస్పద మృతిగా పరిగణించట్లేదని తెలిపారు.
బరువు తగ్గడం కోసం వార్న్ గత రెండు వారాలుగా ఘన ఆహారం తీసుకోకుండా కేవలం ద్రవరూపంలోని డైట్ మెయింటేన్ చేస్తున్నాడని వార్న్ మేనేజర్ తెలిపాడు. వార్న్ మరణానికి ఈ డైట్, తీవ్ర వర్కౌట్స్ కారణమయ్యానని తెలుస్తోందన్నారు.
బరువు తగ్గడానికి వార్న్ దారుణమైన డైట్ లు ఫాలో అయ్యాడు. ఒక స్టేజ్ మాత్రమే పూర్తి చేశాడు. 14 రోజులుగా ద్రవరూపంలోని ఆహారమే తీసుకుంటున్నాడు. అందుకే ఈ మరణం సంభవించవచ్చని వార్న్ మేనేజర్ తెలిపారు.
ఫిబ్రవరి 28న వార్న్ కండలు తిరిగిన తన పాత బాడీని షేర్ చేసి ఆపరేషన్ ఫ్రెడ్ ప్రారంభమై 10 రోజులు అవుతోందని.. జూలై వరకూ తిరిగి ఫిట్ నెస్ గా తయారవుతానని ట్వీట్ చేశాడు. ఫిట్ గా తయారవ్వాలనే లక్ష్యంతో చేసిన డైట్ లే వార్న్ ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని వైద్యులు సూచిస్తున్నారు. బరువు తగ్గడం కోసం ఇలాంటి డైట్స్ ఫాలో కావద్దని హితవు పలుకుతున్నారు.
ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. థాయ్ లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లా గదిలో విగత జీవిగా పడి ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పుడే మరణించాడు. అతడి మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందనే దానిపై వార్న్ మేనేజర్ జేమ్స్ ఎక్స్ కిన్ క్లారిటీ ఇచ్చాడు. మరణించడానికి ముందు షేన్ వార్న్ పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ ను టీవీలో చూశాడని.. మద్యం కూడా తీసుకోలేదని తెలిపాడు. హాలీడే కోసం థాయ్ లాండ్ వెళ్లిన షేన్ వార్న్ బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నాడని తెలిపారు. ‘మ్యాచ్ ల కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లేముందు దొరికిన సమాయాన్ని గడిపేందుకు వార్న్ థాయ్ లాండ్ కు వచ్చాడు. మరణానికి ముందు ఎలాంటి మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోతో కలిసి భోజనం చేయాలనుకున్నాడు. సాయంత్రం 5 గంటలకు మరికొంతమందిని వార్న్, నియోఫిటో తో కలిసి కలవాలనుకున్నాడు.
పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడికి ఏదో అయ్యిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు. 20 నిమిషాలకు ఆంబులెన్స్ వచ్చిందని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఓ గంట తర్వాత వార్న్ చనిపోయాడనే విషయం తెలిసింది.