Begin typing your search above and press return to search.

నా జోలికి వస్తే కాళ్లు విరగ్గొడుతా: కేఏ పాల్ పై శంకరమ్మ మండిపాటు

By:  Tupaki Desk   |   6 Jun 2022 6:11 AM GMT
నా జోలికి వస్తే కాళ్లు విరగ్గొడుతా: కేఏ పాల్ పై శంకరమ్మ మండిపాటు
X
తెలంగాణ అమరవీరుడు ‘శ్రీకాంతాచారి’ తల్లి కాసోజు శంకరమ్మ తాజాగా కేఏ పాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. నా భర్త వెంకటాచారిని మభ్యపెట్టి తన పార్టీలో చేర్చుకున్నారని.. నా కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. నా కుమారుడు శ్రీకాంతాచారి పేరు వాడుకొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే కాళ్లు విరగ్గొడుతానని శంకరమ్మ హెచ్చరించారు.

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో శ్రీకాంతాచారి విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. తమ గ్రామంలో ఉన్న తన భర్త వెంకటాచారిని 'భద్ర' అనే వ్యక్తి రూ.20 లక్షల ప్యాకేజీ మాట్లాడుకొని కేఏ పాల్ దగ్గరకు తీసుకెళ్లి ఆయన ప్రజాశాంతి పార్టీలో చేర్చించారని ఆమె ఆరోపించారు.

తనను కూడా ప్రజాశాంతి పార్టీలో చేరాలని కేఏ పాల్ 15 రోజులుగా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. అమరవీరుల కుటుంబం తరుఫున బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చేలా అమిత్ షాతో మాట్లాడానని.. పార్టీలో చేరాలని ఒత్తిడి పెంచారని ఆమె ఆరోపించారు. తన భర్తను కేఏ పాల్ ఆయన ఇంట్లో నిర్బంధించారని అన్నారు.

అసలు విషయం బయటపడేసరికి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఫైర్ అయ్యారు. తాను రూ.40 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం చేయడం ఏంటని అన్నారు. తాను టీఆర్ఎస్ లో ఉంటానని.. ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. 1000 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఇళ్లు నిర్మించి ఇచ్చే పార్టీకి సపోర్ట్ చేస్తానని స్పష్టం చేశారు.

కేఏ పాల్ పై శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఈ వ్యాఖ్యల వెనుక టీఆర్ఎస్ నేతలు ఉన్నారా? అన్న ప్రచారం సాగుతోంది.

ఇటీవల తెలంగాణలో జిల్లాల పర్యటనకు వెళ్లిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్ నేత దాడి చేశారు. దీనిపై అప్పట్లోనే రాజకీయ దుమారం రేగింది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని కేఏ పాల్ సైతం ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ , తెలంగాణ ప్రభుత్వమే టార్గెట్ గా కేఏ పాల్ విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా ఆయనకు చెక్ పెట్టేందుకే శంకరమ్మ ద్వారా ఈ విమర్శలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.