Begin typing your search above and press return to search.
శరద్ పవార్ మరణించారని వదంతులు
By: Tupaki Desk | 27 Jan 2016 8:19 AM GMTనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మరణించారని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. వైద్య పరీక్షల నిమిత్తం శరద్ పవార్ ఆసుపత్రిలో ఉన్నారు. దీంతో పుణెలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో మంచం మీద కూర్చుని పక్కనే ఉన్న తన కుమార్తెతో నవ్వుతూ ముచ్చటిస్తున్న శరద్ పవార్ వీడియోను ఎన్ సిపి కార్యకర్తలు విడుదల చేశారు. అయితే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో శరద్ పవార్ మరణవార్తను రహస్యంగా ఉంచాలని, బుధవారంనాడు ఈ వార్తను ప్రపంచానికి తెలియజేయాలని ఎన్ సిపి నేతలు భావిస్తున్నారని వదంతులు వచ్చాయి.
దీనిపై ఎన్సీపీ నేతలు స్పందించి పవార్ ఆరోగ్యంగా ఉన్నారని... ఆయన మరణంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని ప్రకటించారు. గతంలో కొందరు మరణించకుండానే మరణించినట్లు వార్తలు వెలువడ్డాయని, ఆ తరువాత వారు చాలాకాలం హాయిగా జీవించారని ఎన్ సిపి నేతలు పేర్కొన్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణించారని అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి వదంతుల వల్ల ఆయా వ్యక్తుల జీవిత కాలం పెరుగుతుందని పార్లమెంటు సభ్యురాలు, పవార్ కుమార్తె సూలే అన్నారు.
కాగా మరణించారని వదంతులు వచ్చిన శరద్ పవార్ బుధవారం ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యతో ఆయన గత రెండు రోజులుగా చికిత్స తీసుకున్నారు. తాను మరణించానన్న వార్తలను చూసి శరద్‌పవార్ నవ్వుకున్నారని ఎన్ సీపీ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్రపతి పదవికి ట్రై చేస్తున్న పవార్ అంటే గిట్టని వారే ఈ వదంతులు వ్యాపింపజేస్తున్నారని ఎన్సీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీని వెనుక ఉన్నదెవరని ఆరా తీస్తున్నాయి.