Begin typing your search above and press return to search.
జగన్ కు పవార్ ఫోన్.. ఏం జరిగిందంటే?
By: Tupaki Desk | 21 May 2019 5:19 AM GMTఎగ్జిట్ పోల్స్ లో క్లియర్ గా మోడీకే అధికారం అంటున్నప్పటికీ.. విపక్షాలు మాత్రం నో అనేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ను భారీ ఎత్తున మేనేజ్ చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మోడీకి భయపడి పలు మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ను మార్చినట్లుగా చెబుతున్నారు. దీనికి బలం చేకూర్చేలా కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోకుండా ఎన్డీయేతర కూటమి ఏర్పాటు దిశగా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలువురు నేతలు ఫోన్లు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం జగన్ కు ఫోన్ చేశారని.. ఎన్డీయేతర పక్షానికి ఆయన మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
పవార్ మాత్రమే కాదు.. మరికొందరు నేతలు కూడా జగన్ కు ఫోన్లు చేయటం.. ఆయన టచ్ లోకి వెళ్లటం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతమంది ఫోన్లు చేస్తున్నా.. జగన్ మాత్రం ఎక్కడా రియాక్ట్ కాకపోవటం కనిపిస్తుంది. నేతలు చెబుతున్న మాటలు.. వారి ప్రపోజల్స్ ను వింటున్న జగన్.. తన నిర్ణయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాత చెబుతానంటూ ఆన్సర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో తమ గెలుపు ఎంత భారీ అన్న విషయంపై జగన్ కు స్పష్టత ఉన్నా.. వాటి గురించి అదే పనిగా మాట్లాడటంలో అర్థం లేదన్న ఉద్దేశంతోనే.. తుది ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడదామన్న మాటను సున్నితంగా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకరికి ఒకలా.. మరొకరికి మరోలా కాకుండా అందరికి ఒకే తీరులో జగన్ రియాక్ట్ అవుతున్నట్లుగా సమాచారం.