Begin typing your search above and press return to search.

శరద్ పవార్ ఏడుపే ఓట్ల వాన కురిపించిందా?

By:  Tupaki Desk   |   24 Oct 2019 9:56 AM
శరద్ పవార్ ఏడుపే ఓట్ల వాన కురిపించిందా?
X
మహారాష్ట్ర ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన అల్లుడు అజిత్ పవార్ లపై కేంద్రంలోని బీజేపీ ఈడీ కేసులు పెట్టించింది. అజిత్ పవార్ ను జైలుకు కూడా పంపింది. ఈ సెంటిమెంట్ ఎన్సీపీకి బాగా కలిసి వచ్చింది. ఏకంగా మహారాష్ట్రలో ఎన్సీపీ 55 స్థానాల్లో గెలుపు దిశలో దూసుకెళ్లింది. శివసేనతో సమానంగా ఎన్సీపీ పశ్చిమ మహారాష్ట్రలో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.

మహారాష్ట్ర ఎన్నికల వేళ కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్సీపీని బీజేపీ కేసులతో ముప్పుతిప్పలు పెట్టింది. ఆపార్టీని దెబ్బతీయాలని చూసింది. ఈడీ కేసులు పెట్టింది.

అయితే ఈ కేసులనే ఎన్సీపీ మహారాష్ట్రలో ప్రచారాస్త్రంగా మలిచింది. ఎన్సీపీ అధినేత, కురువృద్ధుడు శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కేసులు పెట్టి హింసిస్తోందని కంటతడి పెట్టడం ఓటర్లను కదిలించింది. పవార్ అల్లుడు అజిత్ పవార్ కు ఓటర్లు ఘనవిజయం అందించారు. ఆయన పోటీచేసిన నియోజకవర్గంలో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు.

కేంద్రంలోని అధికారంతో బీజేపీ ఇలా ప్రతిపక్షాలను కేసులతో హింసిస్తోందని ఎన్సీపీ చేసిన ప్రచారానికి ఓటర్లు కరిగిపోయారు. ఆ పార్టీని గెలిపించారు. ఇక తాజాగా ఎన్నికల్లో ఎన్సీపీ భారీ విజయం సాధించడంతో శరద్ పవార్ స్పందించారు. ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. బీజేపీ ఆటలు ముందు ముందు సాగవన్నారు. ప్రజల తీర్పును చూసైనా బీజేపీ మారాలని పవార్ స్పష్టం చేశారు.