Begin typing your search above and press return to search.

శరద్ పవర్ కు బిగ్ షాక్.. మహా పాలిటిక్స్ షేక్

By:  Tupaki Desk   |   11 Sep 2022 12:18 PM GMT
శరద్ పవర్ కు బిగ్ షాక్.. మహా పాలిటిక్స్ షేక్
X
చాలా వ్యూహాత్మకంగా శివసేనను చీల్చి ఉద్దవ్ ఠాక్రేను గద్దెదించిన బీజేపీ ఇప్పుడు శివసేనతో దోస్తీ చేసిన ఎన్సీపీకి కూడా గట్టి షాకులు ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు తెరవెనుక ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే శివసేన వర్సెస్ శివసేన రెబల్స్ అన్నట్టుగా రాజకీయం మారిపోయింది.

ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీకి భారీ షాక్ తగిలింది. నవీ ముంబై మున్సిపల్ ఎన్నికల ముందు పవార్ కు ఎదురుదెబ్బ తగిలింది.

ఎన్సీపీ సీనియర్ నాయకుడు అశోక్ గావ్డే సీఎం ఏక్ నాథ్ షిండేను కలిశారు. ఈ క్రమంలోనే ఎన్సీపీకి గుడ్ బై చెప్పి.. షిండే వర్గంలో చేరేందుకు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా.. అశోక్ తో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా ఎన్సీపీని వీడుతున్నట్టు సమాచారం.

నవీ ముంబై జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నుంచి గావ్డేను ఇటీవలే ఎన్సీపీ తొలగించింది. ఆ స్థానంలో నామ్ దేవ్ భగత్ ను ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ నియమించారు. దీంతో మనస్థాపానికి గురైన అశోక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు అవోక్ గావ్డే ఇటీవలే తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా పార్టీ స్థానిక యూనిట్ లో గ్రూపులున్నాయి. కొంత మంది సీనియర్ పార్టీ కార్యకర్తలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నాకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించినట్టు సమాచారం.

దీన్ని బట్టి శివసేనను కబళించిన బీజేపీ.. ఇప్పుడు ఎన్సీపీ ని తుదముట్టించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. మరి బీజేపీ నుంచి ఎన్సీపీ నేతలను శరద్ పవార్ ఎలా కాపాడుకుంటారన్నది వేచిచూడాలి.