Begin typing your search above and press return to search.
'మహా'ప్రభుత్వంలో అలజడి .. కలిసి కొనసాగడం కష్టమేనా ?
By: Tupaki Desk | 15 Feb 2020 9:45 AM GMTశివసేన , కాంగ్రెస్ , ఎన్సీపీ ఈ మూడు పార్టీల సిద్దాంతాలు వేరు , ప్రతిపాదనలు వేరు. కానీ , గత అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన అనూహ్య పరిణామాల తరువాత అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ‘మహా వికాస్ ఆగాఢీ’ పేరుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరలేపారు. అయితే , సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా సీఎం గా శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయగా ..కాంగ్రెస్ , ఎన్సీపీ కి కీలకమైన మంత్రుత్వ శాఖలని కేటాయించారు. ఇప్పటివరకు ఈ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎటువంటి లుకలుకలు లేకుండానే కొనసాగింది.
కానీ , తాజాగా ఎల్గార్ పరిషత్ కేసు.. మహావికాస్ అగాడీ ప్రభుత్వాన్ని పెద్ద సమస్యలో పడేసింది. ఎల్గార్ పరిషత్ కు సంబంధించిన కేసును.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఎన్ ఐఏకి అప్పగించారు. దీనిపై శరద్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది కూడా ఎదో సన్నిహితుల మధ్యన కాదు ..బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసారు. శాంతి భద్రతలు రాష్ట్రపరిధిలోని అంశమని , కేంద్రం ఆ పరిధిలోకి చొచ్చుకురావడం దారుణమని అన్నారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సారథ్యంలో మహా వికాస్ అగాఢీ సేన గా ఏర్పడి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్... ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి గమనార్హం.
ఇకపోతే, గత కొన్ని రోజుల ముందు ఈ కేసును పుణె పోలీసుల నుంచి ఎన్ ఐ ఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం తో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తులో కేంద్రానికి అన్ని అధికారాలు ఉన్నప్పటికీ, తమను సంప్రదించకుండా ఎన్ ఐ ఏకి ఎలా అప్పగిస్తారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోఈ కేసుని సిట్ తోనే జరిపించాలంటూ శరద్ పవార్ డిమాండ్ చేశారు. కానీ , తాజాగా ఈ కేసుని సీఎం ఉద్ధవ్ ఎన్ ఐఏకి అప్పగించడం పై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చూడాలి మరి ఈ అసంతృప్తి మహా సర్కార్ లో ఎలాంటి కుదుపులు తీసుకువస్తుందో ...