Begin typing your search above and press return to search.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఆయనే
By: Tupaki Desk | 25 April 2017 7:22 AM GMTరాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు బీజేపీయేతర పార్టీలు వేగంగా ముందుకు సాగుతున్నాయి.ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాల్సిన అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు సమావేశం జరిపారు. ఒకే అభ్యర్థి విషయంలో ఒక్కతాటిపైకి వచ్చారు. తాజాగా ఈ విషయాన్ని యునైటెడ్ జనతాదళ్ సీనియర్ నేత శరద్ యాదవ్ తెలిపారు.
ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఆయా పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు కృషిచేస్తున్నామని శరద్ యాదవ్ చెప్పారు. ``రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం అంత తేలిక కాదు. కానీ జూలైలో రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది. అందుకు విపక్షాలకు సరిపడా సమయం ఉంది. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చిన తర్వాత ఉమ్మడి అభ్యర్థి పేరును ఖరారుచేస్తాం`` అని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి విషయమై నేతల పేర్లు చర్చించలేదన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ పేరును శివసేన ముందుకు తెచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతిగా పవార్ సరైన అభ్యర్థి అని శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పా రు. కాంగ్రెస్-లెఫ్ట్-జేడీయూ తదితర పార్టీల పరిశీలన లోనూ పవార్ పేరు ఉండటం గమనార్హం. కాగా, ఇటీవల బీజేపీ - శివసేన మధ్య సత్సంబంధాలు లేవు. గత రెండు సార్లు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ శివసేన.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీయేకు మద్దతునిచ్చింది. ఈ నేపథ్యంలో మరోమారు ఎన్డీఏకు వ్యతిరేక అభ్యర్థికి మద్దతు ఇస్తుందా లేదా అనే సందేహం నెలకొంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/