Begin typing your search above and press return to search.
అప్ఘనిస్తాన్ లో షరియా చట్టమే.. ప్రజాస్వామ్యం ఉండదన్న తాలిబన్లు
By: Tupaki Desk | 19 Aug 2021 8:30 AM GMTఅప్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల రాజ్యం మొదలైంది. ఇప్పటికే దేశాన్ని ఆక్రమించుకున్న వారు రాజ్యాంగ విధి విధానాలను ప్రకటిస్తున్నారు. తాలిబన్ల పాలనలో తాము ఉండలేమని చాలా మంది ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయారు. మరికొందరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు ప్రజలెవరూ భయపడవొద్దని, ఎవరి పనులు వారు చేసుకోవచ్చని ప్రకటించారు. మహిళలు కూడా తమ పనులు చేసుకోవచ్చని అన్నారు. అయితే వారు ప్రకటించిన కొన్ని గంట్లోనే తాలిబన్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్ఘనిస్తాన్లో షరియా చట్టం ప్రకారం మాత్రమే పాలన సాగుతుందని అన్నాడు. దీంతో మరోసారి అప్ఘాన్ ప్రజల్లో భయం పట్టుకుంది.
1996 నుంచి 2001 తాలిబ్లను అప్ఘనిస్తాన్ ను పాలించిన విషయం తెలిసిందే. ఈ కాలంలో తాలిబన్ల అరాచకాలు అంతా ఇంతా కాదు. షరియా చట్టం ప్రకారం వారు తమ పాలనను కొనసాగించారు. ఈ చట్టం ప్రకారం కొన్ని కఠినమైన రూల్స్ పెడతారు. ఈ రూల్స్ పాటించాలని ఆదేశిస్తారు. ధిక్కరిస్తే ఏమాత్రం ఆలోచించకుండా కాల్చేస్తారు. ఆ రూల్స్ పాటించినా భయంగానే అప్ఘానీయుల జీవితం సాగుతుంది. మహిళలు తప్పనిసరిగా బురఖా ధరించాలి. 12 ఏళ్లు పైబడిన వారు పాఠశాలలకు వెళ్లకూడదు. పురుషులు గెడ్డం పెంచుకోవాలి. గెడ్డం గీస్తే నేరమవుతుంది. లాంటి నిబంధనలు ఉంటాయి.
అమెరికా సేనలు అప్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు నెలరోజు్లోనే ఆక్రమించారు. దీంతో 20 సంవత్సరాల కిందటి వారి పాలనను అనుభవించిన వారు ఆ దేశం నుంచి అంతకుముందే కొందరు ఇతర దేశాలకు వెళ్లారు. కొందరు అవకాశం దక్కని వారు విమానం రెక్కలను పట్టుకొని వేలాడిన వీడియో ఇటీవల బయటకొచ్చిన విషయం తెలిసిందే. తాలిబన్ల పాలనలో తాముండలేమని అప్ఘాన్ ప్రజలు పారిపోవడాన్ని చూసి తాలిబన్ల ముఖ్య నాయకులు ప్రజలు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని, తాము ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అయితే ఇలా ప్రకటించిన స్థానికుల్లో భయం పోలేదు.
ఎందుకుంటే గతంలోనూ తాలిబన్లు మొదటగా శాంతి మంత్రి జపించి, ఆ తరువాత వారి అరాచకాలను కొనసాగించారు.తమకు వ్యతిరేకంగ ఉన్న వారిని విచక్షణ రహితంగా చంపేసేవారు. దీంతో ఈసారి కూడా తాలిబన్లు ముందుగా శాంతి అని చెప్పి తరువాత వారి అసలు రూపం బయటపెడుతారని కొందరు మీడియా వేదికగా వాదిస్తున్నారు.
అయితే తాజాగా అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఒక కౌన్సిల్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా పాలన సాగిస్తారని ఇస్లామిక్ గ్రూప్ యొక్క అత్యున్నత నాయకుడు హైబతుల్లా అఖుంజాదా ప్రకటించాడు. ఇక మరో నాయకుడు వహీదుల్లా హషిమి మాట్లాడుతూ తాలిబన్లు అప్ఘనిస్తాన్ ను ఎలా నడిపిస్తారోనన్న విషయాలు ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నాడు. అయితే అప్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య దేశం కాదని, ఎలాంటి రాజకీయ వ్యవస్థ వర్తింపజేయడానికి ఏమీ లేదని, ఇది షరియా చట్టం ప్రకారం నడవాల్సిందేనని ఆయన పేర్కొన్నాడు.
ఇక ఫైలెట్లు, సాయుధ దళాలు తాలిబన్ల సైన్యంలో చేరుతారని, ప్రభుత్వ సైనికులను, తమ గ్రూపులోకి ఆహ్వానించి జాతీయ దళాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. వీరిలో చాలా మంది టర్కీ, జర్మనీ, ఇంగ్లాండ్లలో శిక్షణ పొందారని, వీరు ఇప్పుడు అప్ఘన్ సైన్యంలో చేరుతారని తెలిపాడు. 20 సంవత్సరాలుగా ఎస్ ఎన్ సేలనకు సహకరించిన అప్ఘనిస్తాన్ సైనికులను సైతం తాలిబన్లు కాల్చి చంపారు.
ఈ పరిస్థితుల మధ్య తాలిబన్లు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇటీల తాలిబన్ ముఖ్య నాయకుడు బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము ప్రజాస్వామ్యం ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. ఇప్పుడు మరో నాయకుడు ఇలా ప్రకటన చేయడంపై అప్ఘాన్ ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది.