Begin typing your search above and press return to search.
దళితులకు కేసీఆర్ బాకీ రూ.51లక్షలు.. అదెలానో చెప్పేసిన షర్మిల
By: Tupaki Desk | 11 Aug 2021 5:31 AM GMTతెలంగాణ రాజకీయ సంచలనంగా మారిన వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే.. కేసీఆర్ ను విమర్శలు చేసినంతనే.. ఆ పార్టీ నేతలు.. కార్యకర్తలు..ఫాలోవర్లు వెంటనే రియాక్టు అవుతారు.మాటకు మాట అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. అందుకు భిన్నంగా షర్మిల పార్టీ విషయంలో ఉండటం గమనార్హం. ఏ మాత్రం అవకాశం లభించినా.. కేసీఆర్ సర్కారును ఇరుకున పడేలా వ్యాఖ్యలు చేసే షర్మిల.. తాజాగా హుజూరాబాద్ పరిధిలో నిరసన దీక్షను చేపట్టారు.
హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ఆమె నిరుద్యోగ దీక్షను నిర్వహించారు. ఉద్యోగంరాలేదన్న వ్యధతో ఆత్మహత్య చేసుకున్న బాధితుడి ఇంటిని సందర్భించిన ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి.. తానున్నానన్న భరోసాను కల్పించారు. ఈ సందర్భంగా దీక్ష చేపట్టిన ఆమె.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని.. కేసీఆర్ పాలనా తీరున తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ మధ్యన దళిత బంధు పేరుతో దళితుడి బ్యాంకు అకౌంట్లో రూ.10లక్షల మొత్తాన్ని వేస్తున్న వేళ.. దీనిపై షర్మిల తనదైన శైలిలో విమర్శనాస్త్రాల్ని సంధించారు. తాముఅధికారంలోకి వస్తే పేదలకుమూడు ఎకరాల భూమి.. డబుల్ బెడ్రూం ఇంటిని ఇవ్వటంతో పాటు మరిన్ని వరాల్నిప్రకటించిన సీఎం కేసీఆర్.. తెలంగాణలోని ప్రతి దళితుడికి రూ.51 లక్షలు అప్పు పడ్డారని.. అందుకే తాజాగా ఇస్తున్న రూ.10లక్షలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఆమె రూ.51లక్షల బాకీ లెక్కను చెప్పుకొచ్చారు. ‘‘మూడు ఎకరాల భూమి కింద రావాల్సిన రూ.30లక్షలు. ఆ మూడు ఎకరాల నుంచి ఏడేళ్లకు ఎకరాకు లక్ష చొప్పున పంట రాబడి కింద మరో రూ.21 లక్షలు రావాల్సి ఉంది. అంటే.. మొత్తంగా రూ.51లక్షలు కేసీఆర్ బాకీ ఉన్నారన్నారు. అందుకే కేసీఆర్ ఇచ్చే రూజ10లక్షల్ని తీసుకోవాలన్నారు. అంతేకాదు.. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న హామీని షర్మిల గుర్తు చేశారు.
దీక్ష సందర్భంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదా షర్మిల స్పందించారు. తాజాగా వచ్చిన ఉప ఎన్నికలు సామాన్య ప్రజానీకం కోసం రాలేదని మండిపడ్డ షర్మిల.. పగలు.. ప్రతీకారాలు.. వారి బలాబలాన్ని ప్రదర్శించటం కోసం వస్తున్నాయన్నారు. ఉప ఎన్నికలు వచ్చేసరికి దళితులు బంధువులు అయ్యారని.. అందుకే టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దన్నారు. ఎన్నికలు వస్తున్నాయని దళిత బంధుఇస్తామని దేశంలో మరే రాజకీయ పార్టీ చెప్పలేదని దీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
కేసీఆర్ పైనే కాదు.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల మీదా ఆమె మండిపడ్డారు. ‘‘ఏడేళ్లలో ఏం సాధించాం.. ఉద్యమ ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు. చందమామ లాంటి పిల్లలు చనిపోతున్నారు అన్నది కేసీఆరే కదా. మరి ఇప్పుడు ఏమైంది. హుజురాబాద్‌లో ఎన్నికలు ఎందుకు వచ్చాయి. ఈ ఎన్నికలు ప్రజల కోసమా? వాళ్ళ బలాలు నిరూపించుకోవడం కోసమా? టీఆర్ఎస్ నేతలను నిలదీయండి. నిద్రపోయారా, గాడిదలు కాశారా అని అడగండి. ఎంత మంది చచ్చినా కేసీఆర్‌కు ఇంగిత జ్ఞానం లేదు. బీజేపీని కూడా నిలదీయండి. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏవీ. కాంగ్రెస్ ఏనాడూ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేదు’ అని మండిపడ్డారు.
కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఉద్యోగాలు రాలేదు కానీ.. వారింట్లో మాత్రం ఐదు ఉద్యోగాలు వచ్చాయన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో రైతులు,నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల నాలుగింతలు నిరుద్యోగం పెరిగిందన్నారు. ఖాళీలు ఉన్నా ఉద్యోగాలు భర్తీ చెయ్యడం లేదన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టు కేసీఆర్‌లో చలనం లేదన్నారు. కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఉన్నాయి’’ అంటూ విరుచుకుపడ్డారు.