Begin typing your search above and press return to search.

విజయమ్మ.. షర్మిలలు మరోసారి కోర్టుకు రాక తప్పదా?

By:  Tupaki Desk   |   1 April 2021 5:25 AM GMT
విజయమ్మ.. షర్మిలలు మరోసారి కోర్టుకు రాక తప్పదా?
X
అప్పుడెప్పుడో జరిగిన ఎన్నికల ప్రచారంలో నిబంధనల్ని ఉల్లంఘించటంతో పాటు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసు వివిధ కేసుల విచారణ నాంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోర్టుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ.. సోదరి షర్మిలలు పరకాలలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా వారు నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై విచారణ సాగుతోంది. కోర్టు వాయిదాకు హాజరు కావాలన్న కోర్టు మాటతో వారు కోర్టు ఎదుట హాజరయ్యారు. వారిపై పెట్టిన కేసుల్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లుగా కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతోంది. ఈ క్రమలో వారిద్దరిని కోర్టు ఎదుట హాజరు కావాలని పేర్కొంది. దీంతో.. వారిద్దరు కోర్టుకు వచ్చారు.

ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 8న జరగనుంది. మరి.. ఈ కేసు విచారణకు మరెన్నిసార్లు కోర్టు ముందుకు రావాల్సి ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. న్యాయవాద వర్గాల అభిప్రాయం ప్రకారం.. కేసుల్ని కోర్టు కొట్టేయాలని నిర్ణయం తీసుకుంటే.. న్యాయస్థానం ఎదుట మాజరు కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఒకసారి లేదంటే మరోసారి తప్పించి.. ఎక్కువసార్లు కోర్టు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదన్న మాట చెబుతున్నారు.