Begin typing your search above and press return to search.
అస్సలు తగ్గని షర్మిల.. తాజాగా ఆటో డ్రైవర్ అవతారం
By: Tupaki Desk | 17 Jun 2022 8:30 AM GMTపాదయాత్ర చేస్తున్న ఫైర్ బ్రాండ్ షర్మిల.. ఘాటు వ్యాఖ్యలకు పెట్టింది పేరుగా మారారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే విషయంలో ఆమె తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఆమె మాటలు మారాయి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి.
షర్మిల విషయానికి వస్తే.. ఆమెకో ప్రత్యేకత ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఆమె ఎన్ని ఘాటు విమర్శలు చేసినా.. కిమ్మనకుండా ఉండే విషయంలో టీఆర్ఎస్ అధినాయకుడు మొదలు చిన్న నేత మౌనం మాత్రం ఎంతకూ అర్థం కాదు. ఎవరినైనా సరే ఇట్టే మాటలు అనేయటం.. నోరు పారేసుకునే విషయంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా.
అలాంటి కేసీఆర్ సైతం ఇప్పటివరకు షర్మిలను ఉద్దేశించి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనని పరిస్థితి. ఇందుకు భిన్నంగా షర్మిల మాత్రం రోజువారీ లెక్కన ఆయనపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఆమె ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన ఆమె.. ఖాకీ షర్టు ధరించి.. ఆటో ఎక్కిన వైనం అకట్టుకునేలా మారింది.
అదే సమయంలో సీఎం కేసీఆర్ పాలన మీద నిప్పులు చెరిగారు. సీఎం అంటే వైఎస్సార్ మాదిరి ఉండాలని.. ఆయన చెప్పినవన్నీ ఐదేళ్లలో చేసి చూపించారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మోసగాడని.. అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ఇచ్చిన హామీల్ని నెరవేరిస్తే.. కేసీఆర్ మాత్రం డబుల్ బెడ్రూం ఇళ్లు.. రైతులకు రుణమాఫీ.. నిరుద్యోగ భృతి.. ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు.. దళితులకు మూడు ఎకరాలు.. ఇలా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ సర్కారు మంత్రులు రౌడీల మాదిరి వ్యవహరిస్తున్నారంటూ మండి పడ్డ ఆమె.. కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆమె పేర్కొంటూ.. 'నేను నా ముసలిదానికి పావుసేరు బియ్యం చాలు. నాకు ఉద్యమం తప్పించి వేరే ధ్యాస లేదు. నా కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారని చెప్పారు. మరి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కొడుకు.. కూతురు.. అల్లుడికి పదవులు ఇచ్చుకున్నారే తప్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు' అని మండిపడ్డారు. తన విమర్శలకు పదును పెట్టి చెలరేగిపోతున్న షర్మిల వ్యాఖ్యలకు గులాబీ బాస్ ఎప్పటికి రియాక్టు అవుతారో చూడాలి.