Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కంచుకోట నుంచే షర్మిల పోటీ!

By:  Tupaki Desk   |   24 March 2021 1:44 PM GMT
కాంగ్రెస్ కంచుకోట నుంచే షర్మిల పోటీ!
X
తెలంగాణ రాజకీయాల్లో దూసుకొచ్చిన షర్మిల ఇప్పుడు తన రాజకీయ అడుగులు ఎక్కడి నుంచి వేయాలనే దానిపై తీవ్ర కసరత్తు చేసి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పార్టీ ప్రకటించే ఖమ్మం జిల్లా నుంచే పోటీచేయాలని షర్మిల దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ కు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలాగో.. తనకు పాలేరు అలాగేనని షర్మిల అన్నారు.ఈరోజు ఖమ్మం జిల్లా అభిమానులతో సమావేశమైన షర్మిల తాను పోటీచేయాలనుకుంటున్న నియోజకవర్గంపై వారితో స్పష్టత నిచ్చినట్లు సమాచారం. తన ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని కార్యకర్తలతో ఆమె అన్నట్టు తెలిసింది.

పాలేరు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 1999లో టీడీపీ ప్రభంజనం వీచినా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సంభాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009లో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ విజయం సాధించి కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2014లోనూ గెలిచారు.

వెంకటరెడ్డి మరణంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల గెలవగా.. 2018 ఎన్నికల్లో తిరిగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలేరు కాంగ్రెస్ కు కంచుకోట అని తెలిసి టీఆర్ఎస్ ప్రభావం ఇక్కడ లేకపోవడం చూసి షర్మిల ఎంచుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో గెలిచే నియోజకవర్గాన్ని షర్మిల ఎంచుకున్నట్టు తెలుస్తోంది.