Begin typing your search above and press return to search.
హుజూరాబాద్ లో వారికి మద్దతు ఇస్తానని తేల్చేసిన షర్మిల
By: Tupaki Desk | 11 Aug 2021 3:30 PM GMTసంచలనంగా మారిన రాజకీయ ప్రవేశం ఒక ఎత్తు అయితే.. అంతేవేగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పెట్టేసిన వైఎస్ షర్మిల.. తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలంగాణలో ఏ రాజకీయ పక్ష నేతలు ఎవరైనా సరే గులాబీ బాస్ మీద విమర్శలు చేసినంతనే.. అందుకు కౌంటర్లు వరుస పెట్టి వచ్చేస్తుంటాయి. గులాబీ నేతలు చెలరేగిపోతుంటారు. అదేం సిత్రమో కానీ.. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి షర్మిల ఎంత ఘాటు విమర్శలు చేసినా.. అటు సారు ఫ్యామిలీ కాదు. . ఇటు గులాబీ నేతలు... సైన్యం ఎవరూ నోరు విప్పి మాట అనని వైనం కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన షర్మిల.. ఒక రోజు దీక్షను కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఎప్పటిలానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక అవసరం లేదని చెప్పిన ఆమె.. ఇప్పటికే ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరిని బరిలోకి దించకూడదన్న ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్లే వ్యాఖ్యలు చేసిన షర్మిల.. తన దీక్ష్ వేళ మాత్రం అనూహ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఏం చేయనున్న విషయంపై క్లారటీ ఇచ్చేశారు.
ఎవరైనా నిరుద్యోగులు హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో దిగితే వారికి తాను.. తన పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు షర్మిల. దీంతో.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరైనా నిరుద్యోగులు బరిలోకి దిగితే.. వారికి తన మద్దతు ఉంటుందన్న విషయాన్ని తేల్చేశారు. ఇప్పటికే నిరుద్యోగులకు మద్దతుగా ఆమె పలుమార్లు నిరసనలు.. దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కూడా నిరుద్యోగ ఉద్యోగుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఇప్పటికే నిరుద్యోగులు.. ఉద్యోగ నియమాకాల విషయంలో మొదట్నించి తన గళాన్ని వినిపిస్తున్న షర్మిల.. తాజాగా ఎన్నికల్లో నిరుద్యోగులు ఎవరైనా బరిలోకి దిగితే.. ఆమె పార్టీ అందుకు మద్దతు ఇస్తానని చెబుతున్న ఆమె మాటల నేపథ్యంలో.. ఎవరైనా ముందుకు వస్తారా? అంటే రావటం కష్టమేనంటున్నారు. కానీ.. తన ప్రకటనతో తాను నిలబడిన స్టాండ్ మీద ఏ పోరాటానికైనా సిద్ధమన్న సంకేతాల్ని తాజా ఎత్తుతో ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు..నిరుద్యోగుల తరఫు పోరాడే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న షర్మిల ప్రకటనలో పలువురు చూపు ఆమె మీద పడేలా చేసిందని చెప్పాలి. మరి.. ఆమె కోరుకున్నట్లుగా హుజూరాబాద్ లో ఆమె మద్దతు ఇచ్చేదెవరికి అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.