Begin typing your search above and press return to search.
షర్మిల ఎపిసోడ్ లో 12 సైట్లకు నోటీసులు!
By: Tupaki Desk | 18 Jan 2019 5:14 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి.. జగన్ వదిలిన బాణం షర్మిలపై అనుచిత రీతిలో కథనాల్ని అల్లిన వైనం.. దానిపై ఆమె తీవ్ర మానసిక వేదనతో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నుకలిసి ఫిర్యాదు చేయటం తెలిసిందే. తనపై లేనిపోని కల్పితాలతో కథనాలు సృష్టించి.. తనను కించపరుస్తున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు విచారణ షురూ చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు.. షర్మిలపై దుష్ప్రచారం చేసిన 12 వెబ్ సైట్లను గుర్తించారు. వారి ఐపీ అడ్రస్ వివరాల్ని సేకరిస్తున్నారు.
తాజాగా ఆ వెబ్ సైట్లకు నోటీసులు జారీ చేయనున్నారు. ఐపీ అడ్రస్ లు పోలీసులకు చేరటానికి మరో రెండు రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆ వివరాలు అందిన వెంటనే.. నిందితుల్ని గుర్తించి.. వారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. వెనుకా ముందు చూసుకోకుండా.. ఇష్టం వచ్చిన రీతిలో బురద జల్లుతున్న నిందితుల విషయంలో చట్టం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డను పలుచన చేసే దుర్మార్గులకు తగిన శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.