Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో ష‌ర్మిల పొలిటిక‌ల్‌గా స‌క్సెస్ కాలేదు.. అంటున్నారు.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   16 May 2021 10:30 AM GMT
తెలంగాణ‌లో ష‌ర్మిల పొలిటిక‌ల్‌గా స‌క్సెస్ కాలేదు.. అంటున్నారు.. రీజ‌నేంటి?
X
దివంగ‌త వైఎస్ కుమార్తె, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో పార్టీ పెట్ట‌డం.. అధికారంలోకి రావ‌డం.. అనేవి క‌ల‌లేనా? ఆమె దూకుడుకు అప్పుడే బ్రేకులు ప‌డిపోయాయా? అంటే.. ఔన‌నే అంటున్నా రు ప‌రిశీల‌కులు. అలివి కానిచోట‌.. అధికులం! అన్న‌ట్టుగా ష‌ర్మిల తెలంగాణ‌లో పాలిటిక్స్ చేస్తున్నార‌ని.. విమ‌ర్శ‌కులు చెబుతున్నారు. దివంగ‌త వైఎస్ కోసం.. తెలంగాణ ప్ర‌జ‌లు ప్రాణం పెట్టార‌ని, ఆయ‌న కోసం ప్రాణాలు వ‌దిలార‌ని.. సో.. వైఎస్ సెంటిమెంటు ఇంకా ప‌నిచేస్తోంద‌ని ష‌ర్మిల అంటున్నారు.

కానీ, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎందుకంటే.. తెలంగాణ‌లో రాజ‌కీ యాలు చేయాలంటే.. ఈ మ‌ట్టి వాస‌న‌లు.. ఈ మ‌నుషుల పోక‌డ‌లు.. ఇక్క‌డి సెంటిమెంట్లు తెలిసి ఉండా లి. కానీ, ష‌ర్మిల‌కు ఈ మూడింట్లో ఏ ఒక్క క్వాలిటీ కూడా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఆమె పుట్టింది ఏపీలో.. ఇక్క‌డ పెరిగినా.. కేవ‌లం అద్దాల భ‌వంతి వ‌ర‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై ఆమెకు పెద్ద‌గా ప‌ట్టులేదు.

ఈ క్ర‌మంలో ష‌ర్మిల తెలంగాణ‌లో హిట్ కాలేర‌ని చెబుతున్నారు. ఇక‌, ఏపీలో త‌న సోద‌రుడు జ‌గ‌న్ చేసిన‌ట్టు ఇక్క‌డ కూడా రాజ‌కీయాలు చేయాల‌ని ష‌ర్మిల ఆలోచిస్తున్న‌ట్టున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఏపీలో లెక్క‌లువేరు.. తెలంగాణ‌లో వేరు.. అంటున్నారు. ఏపీలో మాదిరిగా తెలంగాణ‌లో డ‌బ్బు ప‌నిచేయ‌దు, కులాలు ప‌నిచేయ‌వు.. అని చెబుతున్నారు. కేవ‌లం తెలంగాణ‌లో పాగా వేయాలంటే.. ఉద్య‌మ పార్టీలు, ఉద్య‌మ నాయ‌కులు స‌క్సెస్ అవుతున్నార‌ని.. చెబుతున్నారు.

ఇక‌, సామాజిక వ‌ర్గాల ప‌రంగా చూసుకున్నా.. రెడ్డి వ‌ర్గం .. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్ని కోరుకుంటోంది. బీసీలు దాదాపు అధికార టీఆర్ ఎస్ వైపు ఉన్నారు. ఓసీలు బీజేపీ వైపు ఉన్నార‌ని అంటున్నారు. ఇక‌, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇక , ష‌ర్మిల‌కు సామాజిక వ‌ర్గాల వారిగా జ‌రిగే న్యాయం ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. అందుకే ష‌ర్మిల పార్టీ స‌క్సెస్ కాలేద‌ని అంటున్నారు. దీంతోనే ష‌ర్మిల సైలెంట్ అయ్యార‌నే అంటున్నారు. ఇదే విష‌యాన్ని కొంద‌రు ఆమెకు చెప్పి.. విర‌మించుకోకుండా.. మొండిగా ముందుకు సాగార‌ని.. నేనే సీఎం అవుతా.. అని క‌ల‌లు కంటున్నార‌ని అంటున్నారు ప‌ర‌శీల‌కు,