Begin typing your search above and press return to search.
పాదయాత్ర వేళ షర్మిల పాట్లు అన్ని ఇన్ని కావా? జనాల కోసం అన్ని తిప్పలా?
By: Tupaki Desk | 21 Oct 2021 2:30 PM GMTమాటలు చెప్పినంత ఈజీగా పనులు జరగవు. అందునా ప్రతికూల వాతావరణంలో చేసే పనులకు ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయా? అంటే అవునని చెబుతున్నారు. దాదాపు ఏడాది మూడు నెలలకు పైనే సాగే ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం షురూ కావటం తెలిసిందే. ఆరంభం అదిరేలా ఉండేందుకు షర్మిల తీవ్రంగా శ్రమించినట్లుగా చెబుతున్నారు.
సాధారణంగా భారీ పాదయాత్రను మొదలు పెట్టినప్పుడు శుభారంభం కోసం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అందుకు తగ్గట్లే షర్మిల ఏర్పాట్లు చేసినా.. ఫలితం పెద్దగా లేదనే అంటున్నారు. మొత్తంగా అయితే మూడు నుంచి నాలుగు వేల మంది మాత్రమే హాజరయ్యారని చెబుతున్నారు. పాదయాత్రను ప్రారంభించటానికి ముందు మాట్లాడే సందర్భంలో.. భారీగా జనసందోహాన్ని షర్మిల అంచనా వేశారని చెబుతున్నారు. అయితే.. ఆమె అంచనాలకు తగ్గట్లుగా జనాలు చేరుకోలేదంటున్నారు.దీంతో.. కాస్త జనం కనిపించేలా చేయటం కోసం షర్మిల పార్టీ వారంతా చెమటలు కార్చాల్సి వచ్చిందని చెబుతున్నారు.
దీంతో.. అప్పటికప్పుడు జనం కోసం పరుగులు తీయాల్సి వచ్చిందని.. ఇలాంటి పరిస్థితిని వారు ఊహించలేదని చెబుతున్నారు. ఈ కారణంతోనే అనుకున్న సమయానికి కాకుండా కాస్త ఆలస్యంగా పాదయాత్ర సభను నిర్వహించారని చెబుతున్నారు. ఏమైనా.. తొలిరోజునే ఊహించని షాక్ షర్మిలకు ఎదురైందని చెబుతున్నారు. అయితే.. ఆమె మాత్రం నిరుత్సాహానికి గురి కాలేదంటున్నారు. తాను అంచనా వేసినట్లుగా జనసమీకరణ విషయంలో జరిగిన తప్పుల్ని గుర్తించి.. అలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తన టీంకు చెప్పినట్లుగా తెలుస్తోంది.