Begin typing your search above and press return to search.

కార్యకర్త ను స్టేషన్ కు తీసుకెళ్లిన సీఐ కు షర్మిల క్లాస్

By:  Tupaki Desk   |   29 Oct 2021 4:59 AM GMT
కార్యకర్త ను స్టేషన్ కు తీసుకెళ్లిన సీఐ కు షర్మిల క్లాస్
X
తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి తీరు కు వ్యతిరేకం గా తెలంగాణ వ్యాప్తం గా తన అభిమానులు.. పార్టీ కార్య కర్తలు ఆందోళనలు.. నిరసనలు చేపట్టాలని వైఎస్ షర్మిల పిలుపు నివ్వటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకరుల తో మాట్లాడుతూ.. ఈ మధ్యన ‘మంగళవారం మరదలు’ ఉద్యోగాల భర్తీ అంటూ ఆందోళన చేస్తుందంటూ విరుచుకుపడ్డారు. మంగళవారం మరదలు అన్న మాట లో బూతు ఏమీ లేకున్నా.. ఈ పద ప్రయోగాన్ని విన్నంతనే సంస్కారం లేని రీతి లో ఉండటం పులువరిని షాకిచ్చింది. సాధారణం గా తొందర పడి వ్యాఖ్యలు చేయని మంత్రి నిరంజన్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా వచ్చాయన్న ఆశ్చర్యాన్ని మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా.. ఒక మహిళా నేత ను ఉద్దేశించి ఈ తరహా వ్యాఖ్యలు ఏ మాత్రం సరికాదు. తన ను ఉద్దేశించి మంత్రి అన్న మాటల కు షర్మిల ఘాటు గా రియాక్టు కావటం.. ‘ఈ కుక్క కు కవిత ఏమవుతారు?’ అంటూ మంట పుట్టే వ్యాఖ్య ను చేయటం ద్వారా.. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా.. బరాబర్ చూసుకుంటానన్న విషయాన్ని తన మాటల తో తేల్చేశారు. ఇదిలా ఉంటే.. తన పై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తం గా ఆందోళన చేయాలని పిలుపు నిచ్చిన వేళలో.. మంత్రుల నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేసిన మహిళా కార్యకర్తల్ని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

తమను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారంటూ సదరు మహిళా కార్యకర్త ఫోన్లో చెప్పటం.. దీని పై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. ఆ ఫోన్ ను సీఐకు ఇవ్వాలని చెప్పటం.. కాసేపటి కి.. మేడమ్ అంటూ సీఐ లైన్లో కి వచ్చినంతనే.. షర్మిల ఆయన్ను ప్రశ్నల తో ఉక్కిరి బిక్కిరి చేశారు. ప్రజా స్వామ్య పద్దతి లో ఆందోళన చేపడుతున్న వారిని అదుపు లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

‘వాళ్ల చేతుల్లో కత్తులు ఉన్నాయా? బాంబులు ఉన్నాయా? ఎందుకు వారిని అదుపు లోకి తీసుకున్నారు? ప్రజా స్వామ్య పద్దతి లోఆందోళన చేయకూడదా? ఆ కుక్క ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అతడి మీద కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి కదా? అలాంటిది చేయకుండా ఇలా చేయటమా?’ అంటూ ఫైర్ అయ్యారు. సీఐ కు క్లాస్ పీకిన షర్మిల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.