Begin typing your search above and press return to search.
‘వైఎస్ఆర్.టీపీ’ ఆవిష్కరణ: కేసీఆర్ పై షర్మిల నిప్పులు
By: Tupaki Desk | 8 July 2021 2:25 PM GMTతెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కూతురు షర్మిల కొత్త పార్టీని, ఆ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 'వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ'గా ప్రకటించారు. జెండాలో నీలం, తెలుపు, పాలపిట్ట రంగులతో రూపొందించారు. మధ్యలో తెలంగాణ చిత్రపటం, అందులో వైఎస్ఆర్ చిత్రాన్ని ముద్రించారు. 80శాతం పాలపిట్ట రంగు, మరో 20శాతం నీలం రంగుతో జెండా రూపొందించారు.
ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. సంక్షేమంలో నంబర్ 1 అని చెప్పుకునే కేసీఆర్.. కరోనా వల్ల అప్పుల పాలైన వారికి ఏం సమాధానం చెబుతారని.. ఎందుకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని షర్మిల ప్రశ్నించారు.
ఇక నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని..ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ లేదు.. ఒక్క ఉద్యోగం తెలంగాణ యువకులకు రావడం లేదని షర్మిల నిప్పులు చెరిగారు. కంట్లో కారం కొట్టి నోట్ల బెల్లం పెట్టినట్లు చేస్తున్నారని సామెతలతో కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కుటుంబాలతోపాటు ఏకంగా రాష్ట్రాన్ని కూడా కేసీఆర్ అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే తెలంగాణలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేశారని.. ఇవి ఎవరి జేబులోకి పోయాయని షర్మిల ప్రశ్నించారు.
కేసీఆర్ ఫ్యామిలీకి ఉపాధి కలిగిందని షర్మిల విమర్శించారు. నలుగురికి ఉద్యోగం వచ్చిందని.. మరి నిరుద్యోగుల సంగతి ఏంటి అని షర్మిల ప్రశ్నించారు.కరోనాను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఆసరా, భరోసా ఉండేదని.. కరీంనగర్ లో ఓ మహిళ దీనగాథ వివరించారు. తమ పార్టీ నాణ్యమైన వైద్యం ఉచితంగా అందజేస్తామని చెప్పారు. బీఎడ్, నర్స్, పోలీస్, క్లర్క్ కోసం లక్షలమంది ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉప ఎన్నిక వస్తే చాలు త్వరలో ఉద్యోగాలు అనే ప్రకటన చేస్తారని.. కోచింగ్ పూర్తయిన జాబ్ లేదని.. స్కిల్ డెవలప్ మెంట్ చేసే విషయంలో ఫెయిల్ అయ్యిందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇవ్వని మోసగాడు కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. ఉపాధి లేకుండా స్వయం సంవృద్ధి ఎలా అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ అంటే సంక్షేమ సంతకం అని.. వైఎస్ఆర్ అంటే చెరగని చిరునవ్వు, చెక్కు చెదరని రూపం అని వైఎస్ షర్మిల అన్నారు.కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. ప్రజల మేలుకోరి పనిచేశారని.. సాయం కోసం మన తర భేదం తేడా లేకుండా వ్యవహరించారని అన్నారు. వైఎస్ఆర్ మాట ఇస్తే బంగారు మాట ఇచ్చినట్టేనని.. శత్రువుల చేత కూడా ప్రశంసలు పొందారని గుర్తు చేశారు.
వైఎస్ఆర్.టీపీలో సంక్షేమం, స్వయం సంవృద్ధి, సమానత్వం అనే మూడు అంశాలు ఉంటాయని షర్మిల చెప్పారు. రేపటిపై భరోసా ఇవ్వడమే సంక్షేమం అని అన్నారు. ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచితంగా వైద్యం అందించింది వైఎస్ఆర్ హయాంలోనేని చెప్పారు.
బతుకమ్మ ఎలా అందంగా ఉంటుందో వైఎస్ఆర్ కూడా అందరినీ అలా ప్రేమించారని షర్మిల చెప్పుకొచ్చారు. జనాభాలో సగం ఉన్న కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా సాధికారికత ఏది అని ప్రశ్నించారు. 50శాతం మంది మహిళలను చట్టసభల్లో కూర్చోబెట్టాలన్నదే తమ ఆకాంక్షల అని చెప్పుకొచ్చారు.దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ఆ తలకాయ సంగతెంటో చెప్పండి కేసీఆర్ సార్ అని షర్మిల ఫైర్ అయ్యారు. మైనార్టీల కోసం కూడా ఫైట్ చేస్తానని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఉందంటే అది వైఎస్ఆర్ పెట్టిన భిక్ష అని ఆయనను దూషిస్తు్న కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతలు చేతగాని దద్దమ్మలు అని విమర్శించారు.ఆధారాలు ఉన్నాయంటున్న బండి సంజయ్ .. ఎందుకు కేసీఆర్ ను జైలులో పెట్టడం లేదని..వారిద్దరూ తోడు దొంగలు అని విమర్శించారు. మొత్తంగా ఈ సభలో కేసీఆర్ టార్గెట్ గానే షర్మిల ప్రసంగం సాగిందని చెప్పొచ్చు.